BRS Party | బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియ.. 119 నియోజకవర్గాలకు ఇంచార్జీలు వీరే
BRS Party | ఇప్పటికే ప్రకటించిన మేరకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియకు సంబంధించిన డిజిటల్ యాప్ మెరుగులు దిద్దుకుంటున్నది. త్వరలో తుది రూపం తీసుకోనున్నది. తెలంగాణ భవన్లో శిక్షణ అనంతరం, వీరు బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమించబడిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జీల ఆద్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లా పార్టీ కార్యాలయాలలో శిక్షణ శిభిరాలు నిర్వహిస్తారు.
BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా అధినేత కేసీఆర్ 119 నియోజక వర్గాలకు ఇంచార్జీలను ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జీలతోపాటు ప్రతీ నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున ఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్లో డిజిటల్ శిక్షణ ఇవ్వబడుతుంది. ఇప్పటికే ప్రకటించిన మేరకు సభ్యత్వ నమోదుకు సంబంధించిన డిజిటల్ యాప్ మెరుగులు దిద్దుకుంటున్నది. త్వరలో తుది రూపం తీసుకోనున్నది.
తెలంగాణ భవన్లో శిక్షణ అనంతరం, వీరు బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమించబడిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జీల ఆద్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లా పార్టీ కార్యాలయాలలో శిక్షణ శిభిరాలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఆయా నియోజకవర్గంలో వున్న బూత్ ల సంఖ్యను బట్టి బూత్‌కు ఇద్దరు చొప్పున నిర్ణయించిన తేదీ నుంచి వారం రోజుల పాటు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా శిక్షణకు హాజరైన వారికి భోజన వసతులు కల్పించబడతాయి. ఈ ప్రక్రియలో రాష్ట్ర కమిటీ నుంచి నియమించబడిన ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జుల ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారాలను, ఆయా జిల్లాల వారీగా నిర్వహించబడుతుంది. ఈ మొత్తం డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తారు.
ప్రకటించిన తేదీ రోజు స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్‌తో సహా పార్టీ ముఖ్యులంతా సభ్యత్వ పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొంటారు. తద్వారా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ పునరుద్దరణ, నమోదు ప్రక్రియ మొదలవుతుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉండేటటువంటి అన్ని రకాల కమిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. ప్రకటించబడిన నిర్ణీత తేదీలలో కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ శిక్షణా శిబిరాలు నిర్వహించబడతాయి.
Read Also :
Bandla Ganesh | మళ్లీ పవన్ కళ్యాణ్‌కి దగ్గరైన బండ్ల గణేష్ .. ‘మెగా 158’ వేదికపై వైరల్ అయిన సన్నివేశాలు
Padma Devender Reddy | రైతులు చనిపోయినా పట్టించుకోని ప్రభుత్వం : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
Tamil Nadu | తమిళనాడులో మంత్రివర్గ విస్తరణ.. 23 మందికి మంత్రివర్గంలో చోటు.. ఇద్దరు కాంగ్రెస్ నుంచి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

