Narahari Rao | ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి అక్రమ సంపాదనలో తవ్వే కొద్దీ షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. రీసెంట్గా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీగా నగదు, బంగారం, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలిసిందే. తాజాగా శనివారం నరహరి బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసిన అధికారులు షాకయ్యారు.
నరహరి రావు కెనరా బ్యాంక్ (శాలిబండ శాఖ) లాకర్లో సుమారు రూ.కోటిన్నర విలువైన నగదును గుర్తించారు. ఏసీబీ అధికారులు చేపట్టిన దాడుల్లో రూ.1.50 కోట్ల విలువైన నగదు. 1.3 కేజీల బంగారం, 8 కిలోల వెండిని సీజ్ చేశారు. బ్యాంక్ ఖాతాల్లో రూ.2.29 కోట్లతోపాటు కోట్లాది రూపాయల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించారు. నరహరి రావు బెడ్రూంలో బెడ్ కింద కోట్ల విలువైన నోట్ల కట్టలు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. నరహరి అవినీతి, అక్రమ సంపాదన ఏ స్థాయికి చేరిందో తెలియజేసే ఈ దృశ్యాలు ఏసీబీ అధికారులతోపాటు అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తున్నాయి.
నరహరి రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నాడు. బ్యాంక్ లాకర్ తాళపు చెవులు ఇచ్చేందుకు తొలుత నరహరి రావు కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో ఏసీబీ అధికారులు కోర్టు ద్వారా సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి లాకర్‌ను బద్దలు కొట్టారు.