న్యూఢిల్లీ: యూనిఫామ్‌లు రక్తసిక్తమయ్యాయని, తమ వాళ్లు గాయలతో ఇళ్లకు చేరుకున్నారని, కొందరు ఆసుపత్రిపాలయ్యారని ఢిల్లీ పోలీస్ కుటుంబ సభ్యులు వాపోయారు. (Cops Families) నీట్ లీక్ వివాదంపై సీజేపీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసన జూలై 20న హింసాత్మకంగా మారి పలువురు పోలీసులు గాయపడటంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న తమ కుటుంబ సభ్యులపై జరిగిన దాడులను చూసి తాము అనుభవించిన భయానక, బాధాకరమైన అనుభవాలను శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
కాగా, పోలీస్ శాఖలో పనిచేస్తున్న తమ వారు కేవలం తమ విధిని నిర్వర్తిస్తున్నారని, వారిని దూషించడం లేదా దుండగులుగా ముద్ర వేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. ‘ఒక యూనిఫాం వెనుక కేవలం ఒక పోలీసు మాత్రమే ఉండరు. వారి వెనుక తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, కుటుంబం మొత్తం కుటుంబం ఉంటారు. వారు సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు అర్ధరాత్రి వరకు ఎదురుచూస్తూ ఉంటారు’ అని పోలీస్ కుటుంబానికి చెందిన ఒక మహిళ తన బాధను పంచుకున్నారు.
తన తండ్రి సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారని, అంతకుముందు భారత నౌకాదళంలో మెరైన్ కమాండోగా కూడా సేవలందించారని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి కుంజల్ తెలిపారు. ‘జంతర్ మంతర్ వద్ద ఉన్న వేదిక దగ్గర ఒక గుంపు మా నాన్నను లాగి, దాదాపుగా చంపేసేంత తీవ్రంగా దాడి చేశారు. ఆయన నాలుగు గంటల పాటు ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో మా నాన్న సహచరులు ఆయనను ఇంటికి తీసుకువచ్చారు. ఆయన యూనిఫాం అంతా రక్తంతో పూర్తిగా ఎర్రగా మారిపోయింది. మా నాన్నను అలా చూడటం మాకు ఎంతో బాధాకరంగా అనిపించింది’ అని వాపోయారు.
అయితే తన తండ్రిపై దాడి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఆయనను నేరస్తుడి’గా చిత్రీకరించడం అత్యంత బాధకు గురిచేసిందని విద్యార్థి కుంజల్ తెలిపారు. ‘నా తండ్రిపై దాడి చేసిన వ్యక్తులు తమ నేరం నుంచి బయటపడేందుకు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారని, అలాగే పోలీసు అధికారులందరిపైనా ఫిర్యాదులు చేయబోతున్నారని తెలిసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నా తండ్రికి న్యాయం కోసం నేను కూడా పోరాడాలని నిర్ణయించుకున్నా. ఇతర పోలీసు కుటుంబాల నుంచి కూడా నాకు మద్దతు లభించింది’ అని అన్నారు.
మరో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్పై జరిగిన దాడి గురించి ఆయన భార్య సీమ వివరించారు. తన భర్త 33 ఏళ్ల కిందట కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరినట్లు తెలిపారు. జూలై 20న ఎప్పటిలాగే ఇంటి నుంచి భోజనం తీసుకుని ఉదయాన్నే డ్యూటీకి వెళ్లారని చెప్పారు. అయితే సాయంత్రం 7 గంటలకు ఫోన్ చేసినప్పుడు ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలిసి షాకయ్యానని అన్నారు. ‘విధి నిర్వహణలో నా భర్తకు ఇచ్చిన హెల్మెట్ పూర్తిగా ధ్వంసమైంది. హెల్మెట్ పగిలిన తర్వాత ఒక రాయి గనుక ఆయన తలకు తగిలి ఉంటే, బహుశా ఆయన ఈ రోజు ప్రాణాలతో ఉండేవారు కాదు. ఆ విషయాన్ని తలుచుకున్నప్పుడు, ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు. ఒకవేళ అదే జరిగి ఉంటే నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఏమయ్యేదో అని నా మనసు వణికిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, రాజకీయ నాయకులు తమ గొంతు కూడా వినాలని బాధిత పోలీస్ కుటుంబాల సభ్యులు విజ్ఞప్తి చేశారు. ‘విద్యార్థుల నిరసనను పోలీసులు క్రూరంగా అణచివేశారని, విద్యార్థులను కొట్టారని మాత్రమే ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజం కాదు. నిరసనకు సంబంధించిన ఒక కోణం మాత్రమే బయటకు కనిపిస్తోంది, కానీ మరో వైపు ఉన్న వాస్తవం పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ అంశంపై పార్లమెంటులో గళం ఎత్తాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నాం’ అని విన్నవినంచారు. పోలీస్ విధుల్లో ఉన్న తమ వారిపై జరిగిన దాడులపై న్యాయపోరాటం చేస్తామని మరికొందరు పేర్కొన్నారు.
पुलिस अधिकारी भी किसी का पिता, पति और बेटा होता है।
दिल्ली में हालिया विरोध प्रदर्शन के दौरान घायल हुए जवानों के परिजनों ने प्रेस कॉन्फ्रेंस में अपना दर्द बयां किया।
वर्दी के पीछे भी एक इंसान और उसका परिवार है! 🙏#WeStandWithDelhiPolice pic.twitter.com/nho0kYqokn— Vijay Solanki (@vijaysolankibjp) July 31, 2026
Wife of an injured Delhi Police ASI:
🗣️ “My husband has served in the Delhi Police for 33 YEARS.On July 20, he left for duty at Jantar Mantar as usual. Around 11 AM, he told me protesters were marching towards Parliament.
By evening, I learned he had been admitted to LNJP…
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) July 31, 2026
एक बेटी का यह दर्द हर दिल को झकझोर देगा जब उसके पिता अपनी ड्यूटी निभाते हुए हिंसा का शिकार बने।
पुलिसकर्मी भी किसी के पिता और बेटे होते हैं जो देश के लिए तैनात रहते हैं।
लोकतंत्र में विरोध का हक सबको है पर वर्दी पर हमला कतई बर्दाश्त नहीं होना चाहिए।#WeStandWithDelhiPolice pic.twitter.com/44zLbmoe7M
— Anil Sharma (@AnilSharma4BJP) July 31, 2026
#WATCH | Delhi | Wife of a Delhi Police ACP, who sustained injuries during the clash between Police and CJP protesters in Delhi on 20th July says, “The moment he returned home late on the night of July 20, injured as he was, was incredibly painful and traumatic for both me and my… pic.twitter.com/lI40EMWnRI
— ANI (@ANI) July 31, 2026