Bad Breath | నలుగురిలో ఉన్నప్పుడు నోటి నుంచి దుర్వాసన వస్తే చాలా ఇబ్బందిగా ఫీలవుతాం. వారితో సరిగ్గా మాట్లాడలేం. కలవలేం. నోరు తెరిస్తే దుర్వాసన వస్తుందని భయపడిపోతుంటాం. ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అని ఫీలైపోతుంటాం. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలామంది మార్కెట్లో దొరికే మౌత్ ఫ్రెషనర్లను వాడుతుంటారు. కానీ ఇలాంటి రసాయనిక మిశ్రమాలను వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి చిట్కాలను ఉపయోగించి ఈ సమస్య నుంచి బయటపడండి.
› బేకింగ్ సోడాను నీటిలో కలిపి పుక్కిలిస్తే నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఇలా కనీసం రోజుకు రెండుసార్లు చేస్తే ప్రయోజనం ఉంటుంది.
› తులసి ఆకులను నమిలినా దుర్వాసనరాదు.
› ఆహారం తీసుకున్న తర్వాత ఒక స్పూన్ నిమ్మరసాన్ని లేదా ఆరెంజ్ పండును తింటే నోటి దుర్వాసన రాదు. నిమ్మ వంటి సిట్రస్ పండ్ల రసాన్ని మోతాదుకు మించి వాడొద్దు. ఇవి దంతాలకు మేలు చేయవు.
› మధ్యమధ్యలో యాలకులు తింటూ ఉండటం వల్ల కూడా నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఆహారం తీసుకున్న తర్వాత ఓ ఇలాచీని నోట్లో వేసుకుంటే దుర్వాసన రాదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.
› టిఫిన్, లంచ్, డిన్నర్‌తో పాటు మధ్య మధ్యలో స్నాక్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దానివల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.
“Anjeer Health Benefits | బరువు తగ్గాలని అనుకునేవారు అంజీర్ ఎందుకు తినొద్దు?”