మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - Sep 12, 2020 , 22:26:14

తియ్యటి తేనెతో ఇన్ని లాభాలా..?

తియ్యటి తేనెతో ఇన్ని లాభాలా..?

హైదరాబాద్‌: ప్రకృతిలో చెడిపోని ఆహారపదార్థం తేనె. భారతీయులు దీనిని పురాతన కాలం నుంచి వాడుతున్నారు. ఆయుర్వేద వైద్యంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిరోజూ దీన్ని తీసుకుంటే అనారోగ్యంబారిన పడమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. తేనేలోని ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..

  • తేనెలో విటమిన్ సీ, విటమిన్ బీ6, ఫ్రక్టోస్, కార్బోహైడ్రేట్లు, రైబోఫ్లోవిన్, నియాసిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.   
  • బరువును తగ్గించడంలో తేనెది కీలకపాత్ర. గోరువెచ్చని నీళ్లలో పరిగడపున తేనెను కలుపుకొని తాగితే కొవ్వు కరిగిపోతుంది. కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ని తేనె కంట్రోల్‌ చేస్తుంది.  
  • గోరు వెచ్చని నీటిలో మిరియాలపొడి, తేనె, చిటికెడు పసుపు కలుపుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొవిడ్‌ నేపథ్యంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.
  • ఇది మంచి యాంటీబయాటిక్‌గా పని చేస్తుంది. దగ్గుతో పాటు గొంతు సమస్యను నియంత్రిస్తుంది.   
  • చర్మ సంరక్షణకు తేనె తోడ్పడుతుంది.  
  • ప్రతిరోజూ స్పూన్‌ తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది
  • కాలిన గాయాలు, ఇతర గాయాలపై తేనెను పూస్తే ఉపశమనం లభిస్తుంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo