న్యూఢిల్లీ : ఆరోగ్యంగా రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు రోజుకు పదివేల అడుగులు (Health Tips) నడవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే పలువురు ప్రతిరోజూ వాకింగ్ చేయడం, తాము నడిచిన స్టెప్స్‌ను స్మార్ట్‌వాచ్‌లో ట్రాక్ చేయడం చేస్తుంటారు. అయితే రోజుకు పదివేల అడుగులు నడవడంలో చాలా మంది తడబడుతుంటారు.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి పదివేల అడుగులు విధిగా నడవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.టీనేజర్లు, యువకులు, మధ్యవయసువారు, వృద్ధులకు ఇలా వేర్వేరుగా టార్గెట్లు ఉంటాయని సూచిస్తున్నారు. రోజులో పదివేల అడుగులు నడిచేందుకు వీలుపడని వారు బరువు తగ్గేందుకు ఐదు సులభమైన టిప్స్‌ను పాటించి తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మెట్లు ఎక్కడం : కార్యాలయాలు, ఇండ్లు, షాపింగ్ మాల్స్‌లో ఎస్కలేటర్లు, ఎలివేటర్లు, లిఫ్ట్‌లు వాడకుండా బదులుగా మెట్లు ఎక్కడం మేలు. ఇది మీరు రోజువారి వేసే అడుగుల సంఖ్యను పెంచడంతో పాటు హార్ట్ రేట్‌ను పెంచి క్యాలరీలను కూడా కరిగిస్తుంది.
కారును దూరంగా పార్క్ చేయాలి : కార్యాలయం , షాపింగ్ మాల్ లేదా బయటకు ఎక్కడకు వెళ్లినా కారును దూరంగా పార్క్ చేసి నడిచి వెళ్లడం, తిరిగి కారు వద్దకు రావడంతో ఎక్కువ అడుగులు వేసే వెసులుబాటు ఉంటుంది.
ప్రజా రవాణా : కారు, బైక్‌ను పక్కనపెట్టి బస్ లేదా మెట్రో రైల్లో ప్రయాణించడం ద్వారా డబ్బు, ఇంధనం ఆదా కావడంతో పాటు స్టెప్ కౌంట్ కూడా పెరుగుతుంది. ప్రజా రవాణాను ఆశ్రయించడంతో మీరు వేగంగా పని ప్రదేశానికి చేరుకోవచ్చు.
లాంగర్ రూట్స్ : షార్ట్‌కట్స్ దగ్గర దారిలో వెళ్లడాన్ని నివారిస్తూ కొద్దిగా దూరమైనా లాంగ్ రూట్ ఎంచుకోవడం ద్వారా స్టెప్ కౌంట్స్ పెరిగి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
షాపింగ్‌కు వెళ్లడం : ఇంట్లోనే కూర్చుని అన్నింటికీ ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం బదులుగా కిరాణా సరుకుల కోసం దగ్గరలోని షాపుకు నడిచివెళ్లవచ్చు. ఇది బరువును తగ్గించడంతో పాటు స్టెప్ కౌంట్‌ను కూడా పెంచుతుంది.
Read More :
Surrogacy Planning | సరోగసీ కోసం ప్లాన్ చేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..!
Health Tips | ఊబకాయంతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!