Surrogacy Planning | సరోగసీ కోసం ప్లాన్ చేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..!
Surrogacy Planning | సరోగసీ విధానంలో పిల్లల్ని కనడం ఇప్పుడొక వరం. ఆధునిక వైద్య విధానంలో సరోగసీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే, సరోగసీకి వెళ్లడానికి ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.
Surrogacy Planning | సర్రోగేట్ (Surrogate) ద్వారా బిడ్డకు జన్మనివ్వడం ఇవాళ ట్రెండ్‌గా మారింది. ఇటీవల పలువురు నటీమణులు సరోగసీ (Surrogacy) ని ఎంచుకుని బిడ్డలకు స్వాగతం పలికిన వార్తలు మనం చూశాం. గర్భం ధరించలేని వారికి ఇది ఓ వరంగా మారింది. ఏ మహిళ అయినా ఏదేని కారణంగా చేత గర్భం దాల్చలేని పరిస్థితుల్లో అద్దె గర్భాన్ని ఎంచుకోవడమే సరోగసీ. ఎందరో ఈ విధానంలో మాతృత్వపు మధురిమలను అనుభవిస్తున్నారు.
ఒక మహిళ మరో వ్యక్తికి బ్డిను కనేందుకు అంగీకరించే ప్రక్రియనే సరోగసీ (Surrogacy) గా పిలుస్తారు. వీటిలో సాంప్రదాయ, గర్భధారణ, పరోపకార సరోగసీ రకాలు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో పిల్లల్ని దత్తత తీసుకోలేని లేదా ఐవీఎఫ్ (IVF) ద్వారా గర్భం దాల్చలేని వ్యక్తులకు ఇది ఆచరణీయ ఎంపికగా అందివచ్చింది. సరోగసీ విధానాన్ని ఎంచుకోవడానికి ముందుగా మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఒక సవాలుతో కూడుకున్న ప్రక్రియ.
సరోగసీకి కారణాలు..
వంధ్యత్వం కారణంగా ఈ విధానాన్ని చాలా మంది ఎంచుకుంటున్నారు. తక్కువ స్పెర్మ్ కౌంట్ (Sperm count) లేదా ఎండోమెట్రియోసిస్ (Endometriosis) వంటి కారణాలతో జంటలు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ పద్ధతిని ఎంపికగా చేసుకుంటున్నారు.
గర్భం దాల్చడం కష్టతరం చేసే ముందస్తు వైద్య పరిస్థితులు ఉన్న జంటలు ఈ విధానాన్ని ఎంచుకుంటారు.
జన్యుపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న పలువురు ఈ విధానంలో పిల్లల్ని కనేందుకు మొగ్గు చూపుతారు.
స్వలింగ సంపర్కులు సహజంగా గర్భం దాల్చలేనందున సరోగసీని ఎంచుకుంటారు.
40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారు తమ వయసు కారణంగా గర్భం దాల్చడం కష్టమైన పరిస్థితుల్లో ఈ విధానాన్ని ఎంచుకుంటారు.
కొన్ని జంటలు వ్యక్తిగత కారణాల వల్ల సరోగసీని ఎంచుకోవాలనుకుంటారు.
తెలుసుకోవాల్సిన అంశాలు..
సరోగసీకి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత తొలుత భర్త, భార్య కలిసి ఈ విషయంపై కూలంకశంగా చర్చించుకోవాలి. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులతో చర్చించడం చాలా ముఖ్యం. కుటుంబసభ్యులకు ఈ ప్రక్రియను అర్థమయ్యేలా చేప్పాలి. వారిని ఈ చర్చలో పాల్గొనేలా చేయాలి. తద్వారా వారు మీకు మద్దతు ఇవ్వగలరు. ఇది ఆలోచనను అనుసరించేందుకు వారికి సమయం కూడా ఇస్తుంది.
సరోగసీ ప్రక్రియ దంపతులకు ఒక భావోద్వేగ ప్రయాణం. వారి నిర్ణయం, దాని ఫలితం గురించి వారు మిశ్రమ భావాలను అనుభవించవచ్చు. ఈ విధంగా అనుభూతి చెందడం సహజం. అందుకని ఏ సందర్భంలోనైనా నమ్మకంగా ఉండటానికి భావాలు, ఆలోచనలను ప్రతిబింబించాలి. సర్రోగసీకి వెళ్లడానికి ముందు దీనికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకోవాలి. ఎవరు సరోగసీకి అర్హులు..? ఎవరు అనర్హులు..? అనేది నిర్ధారించుకోవాలి. చట్టపరమైన హక్కుల గురించి తెలుసుకోవడం అవసరం.
సరోగసీని ఎంచుకున్నప్పుడు దాత, అద్దె తల్లి జన్యుపరమైన రుగ్మతల కోసం పరీక్షలు చేసుకోవడం చాలా ముఖ్యం. ఐవీఎఫ్ లేదా సరోగసీ సమయంలో నవజాత శిశువుకు జన్యుపరమైన రుగ్మత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పిండం అమర్చడానికి ముందు.. ఈ జన్యు పరీక్ష వంశపారంపర్య వ్యాధితో పిల్లవాడిని కలిగి ఉండే అవకాశాలను గుర్తించడానికి ఉపయోగించవచ్చు.
మన దేశంలో సరోగసీని పరిగణనలోకి తీసుకునేటప్పుడు అనుసరించాల్సిన కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అలాగే, సరోగసీని ఎంపిక చేసుకునేటప్పుడు తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఆమె 21 – 35 సంవత్సరాల మధ్య ఆరోగ్యంగా, ఆదర్శంగా ఉండాలి. ఆమె థైరాయిడ్, మానసిక ఆరోగ్యం, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేయాలి. ఆమె శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ధ్రువీకరించే పత్రాలను కలిగి ఉండాలి.
సరోగసీకి చాలా సమయం, డబ్బు అవసరం అవుతుంది. కొందరు ఒకేసారి అనేక పునరుత్పత్తి సాంకేతికతలను ఉపయోగించి పిల్లల కోసం ప్రయత్నించి ఉంఆరు. సరోగసీకి వెళ్లాలనుకున్నప్పుడు రిజల్ట్ పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా అందుకు సిద్ధంగా ఉండటం అలవాటు చేసుకోవాలి.
సరోగసీకి వెళ్లడానికి ముందు.. మీ బిడ్డ మరొకరి గర్భంలో పెరుగుతున్నదనే ఫీలింగ్ వదిలిపెట్టాలి. సరోగసీ ప్రాసెస్ మొదలయ్యే ముందు సర్రోగేట్, బిడ్డ తల్లిదండ్రుల మధ్య మంచి రిలేషన్ బిల్డ్ అయ్యేలా చూసుకోవాలి. ముఖ్యంగా తల్లి, సర్రోగేట్ మధ్య సత్సంబంధం ఉండటం చాలా అవసరం. స్క్రీనింగ్ సమయంలో బిడ్డను సర్రోగేట్ మదర్ కడుపులో పెరగడం చూసి.. ఆ ఫీలింగ్స్ అణచివేసుకోవడం కొంచెం కష్టమే. సర్రోగటీ జర్నీలో అసూయ భావాన్ని దూరం పెట్టాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

