Health Tips | ఊబకాయంతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Health Tips | ఇప్పుడున్న గజిబిజి జీవిన శైలి కారణంగా మనుషులు తెలియకుండానే బరువెక్కిపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉందనే చెప్పొచ్చు. మన లైఫ్స్టైల్లో చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసుకుంటే ఊబకాయం సమస్యను ఈజీగా అధిగమించొచ్చు.. ఆ మార్పులు.. చేర్పులు...
Health Tips | మనిషి జీవనశైలి సమస్యల్లో ఊబకాయం కూడా ఒకటి. సమాజంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయంవల్ల హృదయ సంబంధ సమస్యలు, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఊబకాయం సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని ఆహార నియమాలు పాటించాలి. కొంతమంది బరువు తగ్గడం కోసం మెడిసిన్స్ వాడుతుంటారు. కానీ, వాటివల్ల సమస్య పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే మెడిసిన్స్ జోలికి వెళ్లకుండా రోజూ వ్యాయామం చేస్తూ కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని దూరం పెట్టాలి. అదేవిధంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. మరి కొవ్వును తగ్గించే ఆ పదార్థాలేంటో చూద్దాం..
1. కోడి గుడ్లు
కోడి గుడ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వాటి ద్వారా శరీరానికి విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. బరువు తగ్గాలనుకునేవారు గుడ్లను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు. తద్వారా బరువు పెరుగకుండా కాపాడుకోవచ్చని ఓ పరిశోధనలో తేలింది. ఊబకాయులు రోజూ కనీసం మూడు గుడ్లను అల్పాహారంగా తీసుకోవడంవల్ల వారి శరీర కొవ్వులో 16 శాతం వరకు తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
2. గ్రీన్ టీ
అధిక బరువు సమస్యతో బాధపడే వారికి గ్రీన్ టీ మంచి పరిష్కారం చూపుతుంది. గ్రీన్ టీలో EGCG అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఈ విషయం ఎన్నో పరిశోధనల్లో రుజువు చేయబడింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్, ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌లో దీనికి సంబంధించిన పరిశోధన పత్రాలను ప్రచురించారు.
3. మాడ్పు కారం
ఎండు మిరపకాయలను వేయించి దంచుకుని కారంపొడి చేసుకుంటారు. దీన్నే మాడ్పు కారం అంటారు. ఎండు మిరపకాయల్లో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో క్యాప్సైసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దానివల్ల తృప్తిగా భోజనం చేసిన అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా క్యాప్సైసిన్ వల్ల ఎక్కువ కేలరీలు తరగడమేగాక కొవ్వు కరుగుతుంది. ఆహారంలో మాడ్పు కారం పొడిని వాడటంవల్ల క్యాప్సైసిన్ శరీరానికి తగినంతగా అందుతుంది.
4. ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ శరీరంలో పోగుపడ్డ ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. అదేవిధంగా శరీరానికి అవసరమైన HDL కొలెస్టరాల్‌ను పెంచుతుంది. ఆలివ్ ఆయిల్ శరీరంలో GLP-1 అనే హార్మోన్ విడుదలను కూడా ప్రేరేపిస్తుంది. ఆ హార్మోన్‌వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆలివ్ నూనె జీవక్రియ రేటును పెంచుతుంది. ఆలివ్ నూనెతో వంటలు చేసుకోవచ్చు, లేదా సలాడ్లపై కొన్ని చుక్కలు వేసుకొని తీసుకోవచ్చు.
5. కాఫీ
శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగించే లక్షణం కాఫీకి ఉంటుంది. కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియా రేటును పెంచుతుంది. దీంతో జీవక్రియలకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఇందుకు అవసరమయ్యే కేలరీల కోసం శరీరం కొవ్వును కరిగిస్తుంది. అయితే కాఫీని అతిగా తీసుకోవడం కూడా మంచిది కాదు. కొన్ని దుష్ప్రభావాలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నది.
గమనిక: అయితే ఊబకాయ సమస్య తీవ్రంగా ఉన్నవారు మాత్రం సొంత చిట్కాల జోలికి వెళ్లకూడదు. నిపుణులైన డాక్టర్ల సూచన మేరకు సరైన డైట్‌ను ఫాలో కావాలి.
ఇవి కూడా చదవండి..
Egg for Health | ఈ ప్రయోజనాలు తెలిస్తే మీరు రోజుకో గుడ్డు తినకుండా ఉండరు..
Kiwi Benefits | కివీ పండుతో ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?
Beauty Tips | అందంగా కనిపించాలని మొహానికి రకరకాల క్రీములు పూస్తున్నారా? ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించండి
Health Tips | డెలివరీ తర్వాత పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

