Egg for Health | ఈ ప్రయోజనాలు తెలిస్తే మీరు రోజుకో గుడ్డు తినకుండా ఉండరు..
అధిక ప్రయోజనంగల పోషకాలున్న ఆహార పదార్థాల విషయానికి వస్తే.. కోడిగుడ్డు ముందు వరుసలో ఉంటుంది. మనం రోజుకొక ఉడుకబెట్టిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలుంటాయి. మరి అవేంటో తెలుసుకుందాం..
మనం ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థంలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలుంటాయి. అయితే, కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఎక్కువ ఆరోగ్య ప్రయోజానాలున్న పోషకాలుంటే, మరికొన్ని రకాల ఆహార పదార్థాల్లో తక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్న పోషకాలుంటాయి. ఇక అధిక ప్రయోజనంగల పోషకాలున్న ఆహార పదార్థాల విషయానికి వస్తే.. కోడిగుడ్డు ముందు వరుసలో ఉంటుంది. మనం రోజుకొక ఉడుకబెట్టిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలుంటాయి. మరి అవేంటో తెలుసుకుందాం..
గుడ్డుతో లాభాలివే..
1. కోడిగుడ్ల ద్వారా శరీరానికి రకరకాల పోషకాలు లభిస్తాయి. శరీరానికి కావాల్సిన సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అదేవిధంగా పొటాషియం, విటమిన్-A, కాల్షియం, ఐరన్, విటమిన్-D, విటమిన్ B6, విటమిన్ B12, మెగ్నీషియం గుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. అందుకే అంతే స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
2. కోడిగుడ్డు మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డు సొనలో ఉండే కోలిన్ అనే పోషక పదార్థం మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
3. కోడిగుడ్డులోని ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఈ ఐరన్ గర్భిణులు, బాలింతలకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి గర్భిణులు, బాలింతలు ప్రతిరోజు ఉడుకబెట్టిన కోడిగుడ్డు తీసుకోవాలి.
4. గుడ్డులో ఉండే పోషక విలువలవల్ల ఇది మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా నిరోధించడంలో కూడా తోడ్పడుతుంది.
5. జట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకూ గుడ్డు ఉపయోగపడుతుంది. గుడ్డులోని విటమిన్-A కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.
6. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల అవి ఎముకలు గట్టిపడటానికి తోడ్పడుతాయి.
7. నరాల బలహీనత ఉన్నవారు కూడా ప్రతిరోజూ క్రమం తప్పకుండా గుడ్డును తీసుకోవడంవల్ల ప్రయోజనం ఉంటుంది. అంతేగాక గుండె రక్తనాళాలకు కూడా కోడిగుడ్డుతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Kiwi Benefits | కివీ పండుతో ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?
Health Tips | ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ ఆహారం తీసుకోండి!
Beauty Tips | అందంగా కనిపించాలని మొహానికి రకరకాల క్రీములు పూస్తున్నారా? ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించండి
Summer | ఎండాకాలంలో చిన్న పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

