Kiwi Benefits | కివీ పండుతో ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?
తాజా పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. అయితే మన దేహానికి అన్ని రకాల పోషకాలు సమపాళ్లలో అందేలా చూసుకుని డైట్‌ను ప్లాన్ చేసుకోవాలి.
తాజా పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. అయితే మన దేహానికి అన్ని రకాల పోషకాలు సమపాళ్లలో అందేలా చూసుకుని డైట్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో కివీ పండు కూడా ఒకటి. ఈ పండును తరచూ మన డైట్లో భాగం చేసుకోవడం ద్వారా చర్మ సంరక్షణ నుంచి వ్యాధినిరోధకత వరకు ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మరి ఆ ప్రయోనాలేమిటో వివరంగా తెలుసుకుందాం..
ఇవీ.. కివీ ప్రయోజనాలు..
1. నాజూకైన చర్మం కోసం
కివీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా, నాజూకుగా ఉంచుతుంది. వంద గ్రాముల కివీ పండు తింటే ఒక రోజులో దేహానికి అవసరమైన సి విటమిన్లో అధిక శాతం లభిస్తుంది. అంతేగాక కివీ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి చర్మం పాలిపోకుండా, ముడుతలు పడకుండా కాపాడుతుంది. పచ్చి కివీ ముక్కలు తినడం ద్వారా గానీ, లేదంటే నేరుగా చర్మానికి రాసుకోవడం ద్వారా గానీ ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
2. అదుపులో రక్తపోటు
ప్రస్తుతం ఈ భూమ్మీద లక్షలాది మంది ప్రజలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. వారికి కివీ ఫ్రూట్ ఒక వరం లాంటిది. ఎందుకంటే కివీ పండులో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేగాక రక్తపోటు కారణంగా వచ్చే పక్షవాతం, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
3. జీర్ణశక్తి మెరుగు
కివీ పండు జీర్ణశక్తికి కూడా బాగా పనిచేస్తుంది. ప్రతి 100 గ్రాముల కివీ పండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అంతేగాక, ప్రతిరోజూ మానవ శరీరానికి అవసరమైన ఫైబర్‌లో 12 శాతం అందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఫైబర్లు సునాయాసమైన, ఆరోగ్యకరమైన జీర్ణశక్తికి దోహదం చేస్తాయి. కివీ పండులో ఎంజైమ్‌లను కరిగించే ప్రొటీన్ ఉంటుంది. దాంతో ఎంజైమ్‌లు అత్యంత వేగంగా అమైనో ఆసిడ్స్గా మారుతాయి.
4. ఆరోగ్యకరమైన నిద్ర
కివీ పండులో సెరటోనిన్ లాంటి నిద్రకు ఉపకరించే పదార్థాలు ఉన్నాయి. అందువల్ల తరచూ కివీ పండు తినేవారికి హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఈ పండు మంచి మేలు చేస్తుంది. కివీ పండులోని పదార్థాలు సహజసిద్ధమైన నిద్రకు తోడ్పడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
5. రోగనిరోధక శక్తి పెంపు
ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా సి విటమిన్‌కు కివీ పండు మంచి వనరు. ఈ విటమిన్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా బాగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ క్రమబద్ధీకరణకు తోడ్పడుతాయి. ఫ్రీ రాడికల్స్‌వల్ల శరీరానికి నష్టం జరగకుండా కాపాడుతాతాయి.
6. ఎముకలు పటిష్టం
ఎముక పుష ప్రస్తావన వచ్చినప్పుడు మనకు కివీ పండు అనేది అసలు స్ఫురణకే రాదు. కానీ, వాస్తవానికి కివీ పండులో ఎముకలను బలోపేతం చేసే ఫోలేట్ ఉంటుంది. ఈ ఫోలేట్ ఎముక నిర్మాణానికి తోడ్పుడుతుంది. ఎముకల గట్టితనానికి కివీలోని విటమిన్ కే కూడా బాగా ఉపకరిస్తుంది. అందుకే గర్భిణిల డైట్లో కివీ పండును చేర్చడం చాలా ముఖ్యం.
ఇవి కూడా చదవండి..
Summer | ఎండాకాలంలో చిన్న పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Beauty Tips | అందంగా కనిపించాలని మొహానికి రకరకాల క్రీములు పూస్తున్నారా? ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించండి
Acidity | ఎసిడిటీతో ఇబ్బందా..? ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
Apple Cider Vinegar | ఆపిల్ సైడర్ వెనిగర్.. ఆరోగ్య టానిక్కే.. ఎక్కువైతే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవా..?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

