Summer | ఎండాకాలంలో చిన్న పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Summer | పసిపిల్లలకు వేసవి గండం ఉండనే ఉంటుంది. తగిన ఏర్పాట్లు చేసుకుంటే.. సులభంగానే ఒడ్డున పడవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో డీహైడ్రేషన్ ప్రభావం పొంచి ఉంటుంది.
Summer | డాక్టర్ గారూ నమస్తే! అప్పుడే వేసవి ప్రభావం మొదలైంది. నాకు ఏడాది పాప ఉంది. తన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– ఓ పాఠకురాలు
నిజమే, పసిపిల్లలకు వేసవి గండం ఉండనే ఉంటుంది. తగిన ఏర్పాట్లు చేసుకుంటే.. సులభంగానే ఒడ్డున పడవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో డీహైడ్రేషన్ ప్రభావం పొంచి ఉంటుంది. ఫంగస్, చెమట వల్ల చర్మ ఇన్ఫెక్షన్ల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. నీటి కొరత కారణంగా.. జల కాలుష్యం కూడా ఎక్కువే. అతిసార తదితర రుగ్మతలు పసిపిల్లలకు సమస్యలు సృష్టిస్తాయి.
చికెన్‌పాక్స్ కూడా వేసవిలోనే ఎక్కువ. ఎండ అధికంగా ఉండే సమయంలో పిల్లల్ని బయటికి పంపకూడదు. పలుచని కాటన్ దుస్తులే వేయాలి. తరచూ ఓఆర్ఎస్, కొబ్బరినీళ్లు, పళ్లరసాలు.. తదితర ద్రవపదార్థాలు ఇస్తూ ఉండాలి. కాచి చల్లార్చిన నీళ్లే ఉత్తమం. చర్మం మీద వేడి పొక్కులు వస్తే కాలమైన్ లాంటి లోషన్లు వాడాలి. జ్వరం, నీరసం, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే నిపుణులను సంప్రదించాలి.
– డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్ నిలోఫర్ పిల్లల దవాఖాన, హైదరాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

