న్యూఢిల్లీ : ఆరోగ్యకర ఆహారంతోనే (Superfoods) మనం ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉండగలం. మెరుగైన ఆహారంతో వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు బరువు తగ్గడం కూడా సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లతో కూడిన ఆహారంతో హృద్రోగాలు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారానికి దూరమైతే బరువు పెరగడం, ఊబకాయం, హృద్రోగాలు, మధుమేహం వంటి వ్యాధులను కోరితెచ్చుకునే ముప్పు ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమతులాహారం తీసుకోవడం ద్వారా పలు వ్యాధులను నియంత్రించడంతో పాటు కొన్ని అనారోగ్య పరిస్ధితుల బారిన పడకుండా నివారించవచ్చని చెబుతున్నారు.
మనం తీసుకునే ఆహారంతో పాటు వ్యాయామం కూడా ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక శరీరంలోని వివిధ భాగాలకు ప్రయోజనం చేకూర్చేలా విభిన్న ఆహారాన్ని తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారం గుండెకు మేలు చేస్తే, మరికొన్ని రకాల ఆహార పదార్ధాలు బీపీ, షుగర్‌ను తగ్గిస్తాయి. మనం తీసుకునే దైనందిన ఆహారంలో ఇవన్నీ భాగం చేసుకోవాలి. ఇక బరువు తగ్గుదల, మధుమేహం, హృద్రోగాలను నియంత్రించేందుకు నిత్యం బాదం, ఓట్స్, పాలకూర, పెసలు, రాగి వంటి ఆహార పదార్దాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More :
Tomato | చుక్కలు చూపిస్తున్న టమాటా ధరలు.. త్వరలో కిలో రూ.300కు చేరే అవకాశం..!