శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Health - Jan 27, 2021 , 19:40:23

మీ పిల్ల‌ల‌కు రైస్ మిల్క్ తాగిస్తున్నారా!

మీ పిల్ల‌ల‌కు  రైస్ మిల్క్ తాగిస్తున్నారా!

కొంత‌మంది పిల్లలకు ఆవు పాలు తొందరగా జీర్ణంకావు.  ఇంకొందరికి  జీర్ణ‌మైనా  రకరకాల ఎలర్జీ  సమస్యలు వస్తుంటాయి. బర్రె పాలు, బాదం పాల విషయంలో  చాలా మంది పిల్లలకు ఇలా జరుగుతుంది.  ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలకు ఏ పాలు తాగించాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికోసం రైస్ మిల్క్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. అవును నిజమే బియ్యంతో తయారు చేసే పాలలో లాక్టోస్ ఉండదు. అంతేకాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా వీటిలో ఉన్నాయట. అవేంటో మీ కోసం..!

 రైస్ మిల్క్ విషయంలో గుర్తుంచుకోవాల్సినవి:

1.  రైస్ మిల్క్ ను   బియ్యంతో  తయారు చేస్తారు.  బియ్యాన్ని  పిండిలా చేసి వాటితో పాలను తయారు చేస్తారు. రైస్ మిల్క్ రుచిలో తీపిగా ఉంటాయి. కానీ, వీటిలో లాక్టోస్   ఉండదు. అలాగే ఇది కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. పాలంటే ఎలర్జీ  అనే పిల్లలకు ఇది బాగా సహాయపడుతుంది. 

2. ఇతర పాలతో పోలిస్తే  బియ్యం పాలు విటమిన్ బి 12  మూలం కాదు. మెరుగైన కొవ్వు, పోషకాహార వనరులతో బియ్యం పాలను ప్రత్యామ్నాయంగా మార్చాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

 బియ్యం పాలతో కలిగే ప్రయోజనాలు:

1. రైస్ మిల్క్ లో కొలెస్ట్రాల్ లేనందున అలెర్జీ తగ్గిస్తుంది. అలాగే ఇతర రకాల పాలు కంటే తియ్యగా ఉంటుంది.

2. పిల్లలలో అతిసారానికి చికిత్సగా,  సులభంగా జీర్ణమయ్యేలా ఉంటాయి. 

3. ఆవు పాలు తరువాత, బియ్యం పాలలో అత్యధిక చక్కెరలు, కేలరీలు,  కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

4. అలెర్జీ ఉన్న పిల్లలకు బియ్యం పాలు సురక్షితమైన ఎంపిక. అయితే, బియ్యం పాలు తల్లి పాలకు ప్రత్యామ్నాయం కాదు. ఇది ఆవు పాలు లేదా బాదం పాలకు మాత్రమే ప్రత్యామ్నాయం (వైద్యుడు సిఫారసు చేస్తే).

వీటిని గమనించండి:

1. బియ్యం పాలలో  ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండ‌దు.   

2. ఇందులో ఇనుము ఉండదు, అలాగే  చక్కెరలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న పిల్లలకు ఇవ్వలేము.

3. మీ పిల్లల‌కు   బియ్యం పాలు ఇవ్వడం ప్రారంభించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

VIDEOS

logo