న్యూఢిల్లీ : లిక్విడ్ గోల్డ్‌గా భావించే నెయ్యితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని నటుల నుంచి పోషకాహార నిపుణుల వరకూ చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారానికి అనుగుణంగా కొంత నెయ్యి (Health Tips) తీసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణులు రుజుత దివాకర్ సూచిస్తుండగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ సైతం నెయ్యి తింటానని చెబుతున్నారు. తన శరీరం, మనసు, ఆత్మ సంతోషంగా ఉండేందుకు ఇది సహకరిస్తుందని కరీనా కపూర్ చెప్పారు.
ఇండియన్ సూపర్ ఫుడ్ నెయ్యిని పప్పు, పరాట సహా దాదాపు అన్ని ఆహార పదార్ధాలతో పాటు తీసుకుంటానని కరీనా చెబుతుంటారు. రకరకాల పేర్లతో నెయ్యిని మధ్యప్రాచ్యం, ఇరాన్, ఉగాండా సహా పలు దేశాల్లో వినియోగిస్తారు. ఇక నెయ్యి మనకు అందించే ఆరోగ్య ప్రయోజనాలను చూస్తే ఓ గ్లాస్ పాలలో ఒక స్పూన్ నేయి, పసుపు, మిరియాలతో కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్ధ సాఫీ అవడంతో పాటు శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.
నెయ్యి తరచూ తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభించడంతో పాటు జీవక్రియల వేగం మెరుగవుతుంది. ఇది మనసును ఆహ్లాదపరిచి, శక్తిని అందిస్తుంది. నెయ్యితో బరువు తగ్గడం సులభమవుతుంది. నెయ్యిలో ఉండే బుట్రిక్ యాసిడ్ ప్రీబయోటిక్ ఫుడ్‌గా పనిచేసి ప్రేవుల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. విటమిన్ కే2 ఇందులో పుష్కలంగా ఉండటంతో శరీరం క్యాల్షియంను బాగా గ్రహిస్తుంది.
పసుపు, మిరియాలతో కలిపి నెయ్యిని తీసుకుంటే వాపును తగ్గించడంతో పాటు ఒత్తిడి తొలగి నిద్రలేమిని అధిగమించవచ్చు. నెయ్యిని రోజూ తీసుకుంటే చర్మం కాంతులీనుతుంది. నెయ్యిలో ఉన్న ఔషధ గుణాలతో కణుతులు తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. మధుమేహం కూడా అదుపులో ఉంటుందని నెయ్యి వాడకంతో ఆకలి పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Read More :
Variety Food | ఈ చెప్పులు, హ్యాండ్‌బ్యాగులు లొట్టలేసుకుంటూ తినేయొచ్చు