Variety Food | ఈ చెప్పులు, హ్యాండ్‌బ్యాగులు లొట్టలేసుకుంటూ తినేయొచ్చు
Variety Food | చెప్పులు, పర్సులు, హ్యాండ్‌బ్యాగులు, గొడుగులు... యాక్సెసరీలుగా ఇవన్నీ మనం వాడేవే. కానీ ఇప్పుడు ఆహార పదార్థాల జాబితాలోనూ చేరిపోయాయి. రంగురంగుల్లో రకరకాల రుచుల్లో తయారవుతున్నాయి. ఫ్యాషన్, ఫుడ్ ట్రెండ్ కలయికగా ఆహార పదార్థాలకు కొత్త గ్లామర్‌ను తీసుకొస్తున్నాయి.
Variety Food | చెప్పులు, పర్సులు, హ్యాండ్‌బ్యాగులు, గొడుగులు… యాక్సెసరీలుగా ఇవన్నీ మనం వాడేవే. కానీ ఇప్పుడు ఆహార పదార్థాల జాబితాలోనూ చేరిపోయాయి. రంగురంగుల్లో రకరకాల రుచుల్లో తయారవుతున్నాయి. ఫ్యాషన్, ఫుడ్ ట్రెండ్ కలయికగా ఆహార పదార్థాలకు కొత్త గ్లామర్‌ను తీసుకొస్తున్నాయి. ఇవేకాదు రంగురంగుల డ్రెస్సులూ తియ్యగా నోట్లో కరిగిపోతున్నాయి.

కడుపు నింపుకోడానికే తినడం నుంచి కళ్లు మెచ్చినవీ లాగించే కాలానికి వచ్చేశాం. అందుకే ఆహారాన్ని కూడా అత్యంత ఆకర్షణీయంగా, సరికొత్తగా తీర్చిదిద్దేందుకు సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు క్రియేటివ్ బేకర్లు. అలా అని రుచిలో రాజీ పడతారా అంటే.. తగ్గేదేలే అంటారు. ఇప్పుడు అదే కోవలో తయారవుతున్నాయి ఎడిబుల్ యాక్సెసరీస్. తియ్యటి హ్యాండ్‌బ్యాగులు, నోరూరించే చెప్పులు, కమ్మటి టోపీలు… ఇలా బోలెడు రకాలు ఉన్నాయి ఇందులో. నిజానికి యాక్సెసరీలను ఫ్యాషన్‌కు గుర్తుగా భావిస్తాం.

Variety Food3
ఇక, దుస్తుల సంగతి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. అందుకే మనం ఇష్టంగా తినే ఆహారంలోనూ ముఖ్యంగా యువత ఇష్టపడే కేకుల్లాంటి వాటి తయారీలో ఫ్యాషన్‌కు పెద్దపీట వేస్తున్నారు నవతరం వంటగాళ్లు. తద్వారా ఇటు ఫుడ్, అటు ఫ్యాషన్ల ఫ్యూజన్‌ను సృష్టిస్తున్నారు. ఇందులో షుగర్ వేఫర్లతో తయారయ్యే రంగురంగుల డ్రెస్సులూ, బిస్కెట్లతో హ్యాండ్‌బ్యాగులు, ఫాండెంట్తో టోపీలు, చెప్పులు.. ఇలా ఎన్నో రకాలు చూడగానే నోరూరిస్తున్నాయి. అంతేకాదు కప్‌కేకులు, కోన్లలాంటి వాటితో ఫ్యాషనబుల్ చెప్పుల్ని కూడా తయారు చేస్తున్నారు. వీటిలో కొన్నింటిని డెజర్ట్స్లాగా నేరుగా తింటే, కొన్నింటిని కేకుల మీద అలంకరణకు వాడుతున్నారు.
చిన్న సైజులో రకరకాల రంగుల్లో చూడగానే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. యూట్యూబ్‌తోపాటు రకరకాల ఫుడ్ బ్లాగుల్లో వీటి తయారీకి సంబంధించిన పాఠాలున్నాయి. కాబట్టి, అందుబాటులో ఉన్న పదార్థాలతో మనమూ సొంతంగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలతోపాటు, ఇంటికొచ్చిన పెద్దల్నీ మన టాలెంట్‌తో ఆశ్చర్యపరచొచ్చు! మీరూ ప్రయత్నించండి మరి!
Read More :
“Kasi | కాశీలో ఇన్ని వెరైటీల ఫుడ్స్ దొరుకుతాయన్న సంగతి తెలుసా”
మసాలాతో రొటీన్.. చాక్లెట్, ఐస్‌క్రీమ్ మ్యాగీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా?”
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Food
- variety
- variety food
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

