లండన్ : ఎనర్జీ డ్రింక్ ప్రైమ్ తాగిన అనంతరం బ్రిటన్‌లో ఓ స్కూల్ విద్యార్ధి కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడం కలకలం రేపింది. న్యూపోర్ట్‌లోని మిల్టన్ ప్రైమరీ స్కూల్ కల్ట్ ఎనర్జీ డ్రింక్ ప్రైమ్ దుష్ప్రభావాలపై తల్లితండ్రులను హెచ్చరించింది. ఈ డ్రింక్‌లో ఏకంగా 140ఎంజీ కెఫిన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ వారాంతంలో ప్రైమ్ ఎనర్జీ డ్రింక్ తీసుకున్న తర్వాత ఓ బాలుడు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడని ఈరోజు ఉదయం అతడి తల్లితండ్రులు సమాచారం అందించారని పేరెంట్స్‌కు రాసిన లేఖలో స్కూల్ పేర్కొంది. ప్రస్తుతం చిన్నారి పరిస్ధితి నిలకడగా ఉందని, అయితే ఈ డ్రింక్ హానికారక ఎఫెక్ట్స్‌పై సమాచారం అందిస్తున్నామని వారు తెలిపినట్టు వెల్లడించింది.
గత ఏడాది ఈ డ్రింక్స్ బ్రిటన్‌లో లాంఛ్ కాగా, సూపర్మార్కెట్లలో వీటిని క్యాన్లలో విక్రయిస్తున్నారు. మరోవైపు రిటైల్ సేల్స్‌కు దీటుగా ఈ డ్రింక్స్ ఆన్లైన్లో సేలవుతున్నాయి. ఓ కప్పు కాఫీలో కంటే అధికంగా ప్రైమ్ డ్రింక్‌లో కేఫిన్ ఉంటుందని, ఇది 18 ఏండ్లలోపు పిల్లలకు ఇవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు. కేఫిన్ అధికంగా తీసుకుంటే హార్ట్ రేట్, బీపీ పెరగడంతో పాటు యాంగ్జైటీ, ఇన్సోమ్నియా వంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read More
Tours | విహారయాత్రలకు వెళ్లేప్పుడు ఎలాంటి ఆహారం తినాలి.. ఎంత మోతాదులో తినాలి?