Tours | విహారయాత్రలకు వెళ్లేప్పుడు ఎలాంటి ఆహారం తినాలి.. ఎంత మోతాదులో తినాలి?
వేసవి యాత్రలకు వెళ్తుంటాం.శుభకార్యాలకూ హాజరవుతుంటాం. అక్కడ కొత్తకొత్త రుచులు ప్రయత్నిస్తాం. ఇది ఎంతవరకు మంచిది? ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి? ఎంత మోతాదులో తినాలి?
Tours | వేసవి యాత్రలకు వెళ్తుంటాం.శుభకార్యాలకూ హాజరవుతుంటాం. అక్కడ కొత్తకొత్త రుచులు ప్రయత్నిస్తాం. ఇది ఎంతవరకు మంచిది? ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి? ఎంత మోతాదులో తినాలి?
– ఓ పాఠకురాలు
మనం ఆహారాన్ని ఎంచుకునేప్పుడు సీజనల్..లోకల్.. ఈ రెండిటికీ ప్రాధాన్యమివ్వాలి. ఏ ఆహారమైనా స్థానిక వాతావరణానికి సరిపడేలా ఉంటుంది. అలాగే అక్కడి పండ్లూ, కూరల్లోని పోషకాలు కూడా ఆ ప్రాంతపు అవసరాలకు తగ్గట్టుగా లభిస్తాయి. కాబట్టి ఇతర రాష్ర్టాలు, దేశం.. ఎక్కడికి వెళ్లినా ఆ సీజన్లో, ఆ ప్రాంతంలో దొరికే వాటికే ప్రాధాన్యమివ్వండి. అయితే, ఆహారం ఏదైనా డీప్ఫ్రైలకు దూరంగా ఉండటం మంచిది. వేసవిలో ఈ జాగ్రత్త మరీ ముఖ్యం. అప్పుడే అరుగుదల సులభంగా ఉంటుంది. అయితే, ఇప్పటిదాకా ఎప్పుడూ తినని కొత్త ఆహారాన్ని రుచి చూడాలనుకున్నప్పుడు.. అది కూడా ముఖ్యంగా మాంసా హారమైతే, తప్పకుండా మధ్యాహ్న భోజనంతోనే ముగించేయండి. పొరపాటున ఇబ్బంది పెట్టినా రాత్రికల్లా సర్దుకుంటుంది. డాక్టర్‌ను కలవాల్సి వచ్చినా పగటిపూట కాబట్టి సులభమే.
సాయంత్రం భోజనంలో తప్పకుండా పెరుగన్నం లేదా మజ్జిగ ఉండేలా చూసుకోండి. జీర్ణాశయ సమస్యల్ని ఇది సరిచేస్తుంది. రాత్రిపూట మితంగా తింటేనే మేలు. వేసవి కనుక ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండండి. బాటిల్ నీళ్లకే మొగ్గు చూపండి. బ్రేక్‌ఫాస్ట్‌లో బాయిల్డ్ ఎగ్, మధ్యమధ్యలో కాలక్షేపానికి బాదం, వాల్నట్ లాంటివి తీసుకుంటే ఉత్సాహంగా ఉంటుంది. బాగా తిరగగలం. అప్పుడప్పుడూ గింజలు తినడం వల్ల చాలాసేపు ఆకలి వేయదు. దీంతో అడ్డమైందీ తినేసే ప్రమాదం ఉండదు. శుభకార్యాలకు వెళ్లినప్పుడు భోజనానికి ముందు సలాడ్ తీసుకుంటే సరి. సగం కడుపు నిండిపోతుంది. దీనివల్ల మిగతా రుచులు మరీ ఎక్కువ తినలేం. సురక్షితమైన మంచినీళ్లూ ముఖ్యమే.
మయూరి ఆవుల,న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

