న్యూఢిల్లీ : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఆహార నియమాలు పాటించినా జీర్ణసంబంధ సమస్యలు (Health Tips) పలువురిని వెంటాడుతుంటాయి. ఆహారం జీర్ణం కావడం, వ్యర్ధ పదార్ధాల తొలగింపు, పోషకాలను శరీరం సంగ్రహించడం వంటివి సజావుగా సాగకపోతే అజీర్తి, కడుపుబ్బరం, వికారం, మలబద్ధకం వంటి సమస్యలు వేధిస్తుంటాయి.
అయితే వంటింట్లో దొరికే వస్తువులతో వీటి నుంచి ఉపశమనం పొందవచ్చని, వంటింటి ఔషధాలతో అజీర్తి సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత తీసుకునే సోంపు జీర్ణశక్తి సహా పలు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. బీపీని అదుపులో ఉంచడంతో పాటు వాటర్ రిటెన్షన్ తగ్గించడం, బరువు తగ్గించడం, కంటిచూపును మెరుగుపరచడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సోంపు తీసుకోవడం ద్వారా పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
సోపులో ఉండే అధిక ఫైబర్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఇక అల్లం కూడా వికారాన్ని నివారించి జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. పలు ఆహార పదార్ధాల్లో అల్లాన్ని జోడిస్తే ఆరోగ్యంతో పాటు రుచి కూడా లభిస్తుంది. అల్లం టీ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇంకా పెరుగు, నిమ్మకాయ రసం, పెప్పర్మెంట్ వంటివి జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తాయి.
Read More :
Uttar Pradesh | దారుణం.. పెళ్లికి ముందే గర్భం దాల్చిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు