Belly Fat | పొట్ట చుట్టూ పెరిగిన కొవ్వును ఇలా తగ్గించుకోండి..
Belly Fat | ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి.. కారణమేదైనా కానీ, వయసుతో సంబంధం లేకుండా వేధిస్తున్న సమస్య అధిక బరువు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు అనేక మార్గాలు..
అన్ని పోషకాలూ కలిగిన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. భోజనంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించడంలో ఫైబర్ సాయపడుతుంది. ఫైబర్ సమృద్ధ ఆహారం వల్ల చాలాసేపటి వరకూ ఆకలి వేయదు. దీంతో మరింత ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సులభంగా బరువు తగ్గవచ్చు. ఇది ఆహారం నుంచి కేలరీల శోషణను కూడా తగ్గిస్తుంది. దీనివల్ల పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుంది.
ట్రాన్స్ ఫ్యాట్స్ వద్దు
ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ప్రధానంగా నూనెలను వేడి చేసినప్పుడు ఏర్పడతాయి. అంటే, నూనెలో వేయించిన లేదా నూనెతో తయారు చేసిన పదార్థాల్లో ఇవి అధికంగా ఉంటాయి. అందువల్ల నూనె పదార్థాలను ఎక్కువగా తినకూడదు. తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకూ ఆస్కారం ఉంది. నూనె పదార్థాలను మానేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. వారంలో కనీసం ఒక రోజు అయినా ఉపవాసం ఉండాలి. అప్పుడప్పుడు ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ను అనుసరించాలి. అంటే రోజులో 6 గంటల పాటు మాత్రమే తిని, మిగతా 18 గంటల పాటు జీర్ణాశయాన్ని ఖాళీగా ఉంచాలి. ఇలా చేస్తుంటే..పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కనీసం 4 నుంచి 7 శాతం వరకు కరుగుతుందని చెబుతారు నిపుణులు.
ఒత్తిడిని తగ్గించుకోవాలి
ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలై.. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. కాబట్టి, ఒత్తిడిని వదిలించు కోవాలి. కుటుంబంతో, స్నేహితులతో సమయం గడపడం, యోగా, ధ్యానం ఒత్తిడిని కొంతమేర నివారిస్తాయి. అంతేకాదు, ఆల్కహాల్ మితం తప్పి తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్ర హాని కలుగుతుంది.
వ్యాయామం ఉత్తమం
రోజూ వ్యాయామం చేయడం వల్ల పొట్ట దగ్గర కొవ్వుతో సహా శరీరంలో ఉండే అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. మంచి ఫలితం పొందాలంటే రోజూ కనీసం 30 నిమిషాల చొప్పున, వారానికి కనీసం 5 రోజులపాటు వ్యాయామం చేయాలి. చెమట పట్టేలా కసరత్తు చేసి హృదయ స్పందన రేటును పెంచాలి. దీనివల్ల కూడా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. వేగవంతమైన నడక, స్కిప్పింగ్, జాగింగ్, ఏరోబిక్ వ్యాయామం వంటివి కూడా కొవ్వును కరిగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
Read More :
GREEN TEA: ఈ సమయంలోనే తాగితేనే అధిక బరువుకు చెక్!!”
పల్లీలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా..!!”
Health Tips | జీవక్రియల వేగం పెరిగేందుకు కొవ్వును కరిగించండిలా..!”
“బరువు తగ్గేందుకు హెర్బల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా? అయితే, ఈ వీడియో చూడండి..”
ఈ డ్రింక్స్ ప్రతిరోజూ ఇలా తాగితే ఈజీగా అధిక బరువుకు చెక్‌పెట్టొచ్చు!!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

