గ్రీన్ టీ.. ఇప్పుడు అందరి ఇండ్లలోనూ కనిపిస్తున్నది. జీవితంలో ఓ భాగమైపోయింది. ఆరోగ్యంపై శ్రద్ధవహించేవారందరి వంటింట్లోకి ఇది చేరిపోయింది. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు సూచిస్తుండడంతో అందరూ గ్రీన్ టీ బాట పట్టారు. అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌కు చెక్ చెప్పేందుకు, అందమైన మెరిసే చర్మం కావాలనుకునేవారు..పొద్దంతా జోష్ ఉండాలని కోరుకునేవారు..మెటబాలిజం బాగుండాలని అనుకునేవారు ఈ తేనీరును సేవిస్తున్నారు. అయితే, చాలామంది గ్రీన్ టీని ఎప్పుడు పడితే అప్పుడు తాగుతున్నారు. అలా తాగితే ప్రయోజనం లేదట. గ్రీన్ టీని సరైన టైంలో, సరైన ప్రమాణంలో తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. మరి అవేంటో తెలుసుకుందామా?