Corona effect : కరోనా సంక్షోభం చేయిదాటిపోతోంది !! దవాఖానాల్లో ఆక్సిజన్ కొరత ఇప్పుడు కలవరపెడుతోంది !! తెలంగాణ సర్కార్ ముందుచూపుతో వ్యవహరించడం వల్ల ప్రస్తుతానికైతే రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ నిల్వలకు కొరత లేదు. కానీ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఇప్పుడు తీవ్రంగా ఉంది. అక్కడి పరిస్థితులను చూస్తే మిగతా రాష్ట్రాల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఇందుకు కారణం కరోనా సెకండ్ వేవ్‌లో ఎక్కువ మంది రోగులు శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడటమే. వారికి కావాల్సిన ఆక్సిజన్ అందిస్తుండటంతో ఈ కొరత సమస్య తలెత్తుతుంది. ఈ క్రమంలో కొవిడ్-19 రోగులు శ్వాస సమస్యలను అధిగమించడం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ పలు జాగ్రత్తలు సూచించింది. బోర్లా పడుకుని బలంగా శ్వాస పీల్చడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చని చెబుతోంది. ఈ విధానాన్ని ప్రోనింగ్ ( Proning ) అంటారని తెలిపింది.
ఛాతి, పొట్టపై బరువు పడేలా బోర్లా పడుకుని లేదా ఒక పక్కకు పడుకుని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు కావాల్సినంత ఆక్సిజన్ అందుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బోర్లా పడుకుని శ్వాస తీసుకోవడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చని ఇటీవల ఒక వీడియో వైరల్ కూడా అయిన సంగతి తెలిసిందే. ప్రోనింగ్ పొజిషన్ ( Proning position ) అని పిలిచే ఈ విధానం వైద్యపరంగా ధ్రువీకరణ పొందిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులు ఈ ప్రక్రియ ఎంతో మేలు చేస్తుందని తెలిపింది.
Read more: 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి
మంచంపై ముందు బోర్లా పడుకోవాలి. తర్వాత మెడ కింది భాగంలో ఒక దిండును పెట్టుకోవాలి. ఛాతి నుంచి కింద వరకు రెండు దిండ్లను ఉంచుకోవాలి. మరో రెండు దిండ్లను మోకాలి కింద పెట్టుకోవాలి. ఈ ఒక్క భంగిమలోనే కాకుండా వివిధ యాంగిల్స్‌లో కూడా విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్కో పొజిషన్లో 30 నిమిషాల కంటే ఎక్కువగా పడుకోవద్దు. ఆక్సిజన్ లెవల్స్ 94 శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలో ఈ ప్రోనింగ్ అవసరం.
#Unite2FightCorona
— Ministry of Health (@MoHFW_INDIA) April 22, 2021
Proning as an aid to help you breathe better during #COVID19 pic.twitter.com/FCr59v1AST
Read more: బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Corona effect : భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు
దేశంలో అందుబాటులోకి మరో టీకా.. జైడస్ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి
మే మూడో వారంలో కరోనా మరింత ఉద్ధృతం: ఎస్బీఐ రిపోర్ట్
లాభం తీసుకోకుండానే వ్యాక్సిన్లు ఇస్తాం.. ఇండియాకు ఫైజర్ ఆఫర్
గుజరాత్ లో దారుణం : కొవిడ్ బెడ్ కోసం రూ 9000కు బేరం