Falsa Health Benefits : ఆరోగ్యానికి పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతి పండూ తనదైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిఉండి రుచితో పాటు శరీరానికి అవసరమైన కీలక పోషకాలను అందిస్తుంది. ఇక ముత్యాల్లా మెరిసిపోతూ కనిపించే ఫాల్సా పండ్లు వేసవిలో సందడి చేస్తుంటాయి. ఫాల్సా పండ్లను ఇండియన్ షెర్బెత్ బెర్రీ అని కూడా పిలుస్తుంటారు.
ఫాల్సా పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి ఎన్నో పోషకాలున్నాయి. ఫాల్సాను నిత్యం తీసుకుంటే వీటిలో ఉండే ఫెనోలిక్, యాంటోసినిన్స్ వంటి యాంటిఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రల్ చేయడంతో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నియంత్రించి హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధుల బారినపడే ముప్పును తగ్గిస్తాయి.
ఫాల్సా పండ్లలో పొటాషియం లెవెల్స్ అధికంగా ఉండటంతో పాటు సోడియం తక్కువగా ఉండటంతో బీపీని నియంత్రిస్తాయి. వీటిని నిత్యం తీసుకుంటే బీపీ అదుపులో ఉండటంతో పాటు హృద్రోగ ముప్పు తగ్గుతుంది. ఇక ఫాల్సా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే…
యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం
యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు
గుండె ఆరోగ్యానికి మేలు
బరువు నియంత్రణ
జీర్ణశక్తి మెరుగుదల
బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణ
చర్మ ఆరోగ్యం మెరుగుదల
శ్వాసకోశ ఆరోగ్యం మెరుగు
శరీరానికి ఉత్తేజం
Read More :
RS Praveen Kumar | కాంగ్రెస్ గూండాల్లారా ఖబర్దార్..! హెచ్చరించిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్