Coffee | కాఫీ మంచిదా, కాదా? అన్నది తేల్చేందుకు రకరకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని సానుకూల ఫలితాలనూ, కొన్ని ప్రతికూల ఫలితాలనూ నివేదిస్తున్నాయి. ఏతావాతా, అతి సర్వత్ర వర్జ్యయేత్ అన్న సామెత కాఫీకి కూడా వర్తిస్తుందన్నది పరిశోధనల సారాంశం. అందుకు బలంగా మరో పరిశోధన కూడా వెలుగులోకి వచ్చింది.
యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు మోతాదుకు మించి కాఫీ తాగడం వల్ల మెదడు మీద ప్రభావాన్ని గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 17 వేల మందిని ఎంచుకొన్నారు. ఆశ్చర్యంగా ఆరుకప్పులకు మించి కాఫీ తాగేవారి మెదడు ( Brain ) మీద తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించాయి. వీరిలో డిమెన్షియా ( dementia ) అనే మతిమరుపు వ్యాధి వచ్చే ఆస్కారం 53 శాతం ఎక్కువైనట్టు తేలింది. డిమెన్షియా ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి ( Memory loss ), ఆలోచన క్షీణిస్తాయి. కాబట్టి, చిరాకుగా ఉందనో, తలనొప్పి వస్తోందనో, పని ఒత్తిడిలోనో… లోటాల కొద్దీ కాఫీ పుచ్చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?
Healthy food | తరచూ ఈ స్వీట్ తింటే అస్తమా, ఎసిడిటీ దూరం కావాల్సిందే
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది..?