కూరలో కరివేపాకును తీసిపారేయకండి..!
Health tips | కరివేపాకు జీర్ణశక్తిని పెంచుతుంది. అందుకే ఆహారంలో తరచూ కరివేపాకు వాడడంవల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

హైదరాబాద్: కూరల్లో వేసుకునే కరివేపాకును తినేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. చాలా మంది కూరలో కరివేపాకు కనిపించగానే తినకుండా పక్కకు పెడుతారు. ఎక్కువ మంది ఇలా కరివేపాకును తీసిపారేస్తారు కాబట్టే.. ఎవరినైనా తక్కువ అంచనా వేసినప్పుడు కూరలో కరివేపాకులా తీసిపారేయొద్దు అనే సామెత వినిపిస్తుంది. కానీ, కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. పలు సమస్యలకు అది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అందుకే కూరలో కరివేపాకును అస్సలు తీసిపారేయొద్దు. మరి కరివేపాకుతో కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం..
- కరివేపాకుకు జీర్ణశక్తిని పెంచే లక్షణం ఉన్నది. అందుకే ఆహారంలో తరచూ కరివేపాకు వాడడంవల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- కరివేపాకు శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, సి లను సరఫరా చేస్తుంది. రక్తంలో కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. అందువల్ల కరివేపాకును తరచూ తీసుకుకోవడం ద్వారా బరువు పెరిగే ప్రమాదం నుంచి కూడా బయటపడవచ్చు.
- కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంతో కూడా తోడ్పడుతాయి.
- కరివేపాకుల్లో ఉండే ఫైబర్ ఇన్సులిన్‌ను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
- అంతేకాదు, కరివేపాకు మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. కరివేపాకులో మెదడుతోపాటు మన నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడే పదార్థాలు చాలా ఉంటాయి.
- కరివేపాకుతోపాటు, దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీ బయాటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో తోడ్పడుతుంది.
- కరివేపాకు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కరివేపాకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో స్నానంచేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి పరిష్కారం లభిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ప్రజలకు ఫేస్ మాస్కులు పంచిపెట్టిన దేవుళ్లు..!
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి
మామిడి పండ్లు తింటే ఇన్ని లాభాలా..!
38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్.. ఏ జైల్లోనో తెలుసా..?
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్‌కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

