బెంగాల్లో కరోనా కొత్త వేరియంట్.. పెరుగుతున్న కేసులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కొత్త వేరియంట్ కరోనా కలకలం సృష్టిస్తున్నది. సార్స్ సీఓవీ2 వైరస్ వేరియంట్‌ను B.1.618గా గుర్తించారు. ఇండియాలో కరోనాకు చెందిన వేరియంట్‌ను గుర్తించడం ఇది రెండవది. డబుల్ మ్యూటెంట్ వైరస్‌గా పిలవబడుతున్న B.1.617ను ఇప్పటికే ఇండియాలో పసికట్టిన విషయం తెలిసిందే. బెంగాల్లో ఉన్న పాజిటివ్ కేసుల్లో B.1.618 ఉన్నట్లు సీఎస్ఐఆర్ పరిశోధకుడు వినోద్ స్కారియా తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో కరోనా B.1.618 రకాన్ని ఓ బెంగాల్ రోగిలో గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన ఆనవాళ్లు అమెరికా, స్విట్జర్లాండ్, ఫిన్‌ల్యాండ్, సింగపూర్‌లో ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు. B.1.618 రకానికి చెందిన కరోనాలోని స్పైక్ ప్రోటీన్‌లో అమినో యాసిడ్స్ లేనట్లుగా తేల్చారు. బెంగాల్లో జనవరి నుంచి ఈ రకం వైరస్ ఉన్న కేసులు పెరుగుతున్నాయన్నారు. కానీ కరోనా ఉదృతికి ఇదే కారణమని కూడా చెప్పాలేమని వినోద్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

