న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ముందస్తు దశలోనే దీన్ని పసిగడితే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను (Health Tips) నయం చేయడం వీలవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో పునరుత్పాదక వ్యవస్ధలో కీలకమైన విధులను ప్రొస్టేట్ నిర్వహిస్తుంది.
ప్రతి 8 మంది పురుషుల్లో ఒకరు జీవితంలోని ఏదో ఒక దశలో ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడతారని, వీరిలో 41 మందిలో ఒకరు మరణిస్తారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇక ప్రొస్టేట్ క్యాన్సర్‌కు దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రీసెర్చ్‌లో తేలింది. దాల్చిన చెక్కలోని పదార్ధాల్లో కీమోప్రివెంటివ్ ఎఫెక్ట్ ఉంటుందని ఈ పరిశోధనలో గుర్తించారు.
ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో దాల్చిన చెక్కలో ఉన్న పదార్ధాలు ఎముకల క్షీణతను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేశాయని వెల్లడైంది. దాల్చినచెక్కలో ఉండే బయోయాక్టివ్ పదార్ధాలు పురుష ఎలుకలపై చేపట్టిన పరిశోధనలో ఈ సానుకూల ఫలితాలను ఇచ్చాయని జర్నల్ క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. ఇక ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు పరిశీలిస్తే..
మూత్ర విసర్జనలో ఇబ్బందులు
మూత్రంలో రక్తం
ఎముకల నొప్పి
బరువు తగ్గడం
అంగస్తంభన సమస్యలు
Read More :