Better Sleep | ప్రతి రోజూ శరీరానికి తగినంత నిద్ర చాలా (Better Sleep) అవసరం. అయితే, మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లకు తోడు ఓటీటీ రాక కూడా ఇందుకు ఓ కారణం అని చెప్పొచ్చు. చాలా మంది రోజులో ఎక్కువ సమయం వీటితోనే గడిపేస్తున్నారు. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలనూ ఎదుర్కోవాల్సి వస్తోంది. సరిగ్గా నిద్ర లేక రోజంతా యాక్టీవ్‌గా ఉండలేకపోతున్నారు. అంతే కాకుండా తమ పనిపై కూడా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.
రోజంతా శక్తివంతంగా ఉండటం కోసం రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్ర పోవడం చాలా ముఖ్యం. ఇది మన మెదడును రీఛార్జ్ చేస్తుంది. అంతేకాదు కంటికి, శరీరానికి కూడా ఎంతో విశ్రాంతిని ఇస్తుంది. సరిగ్గా నిద్రపోకపోతే చిరాకు, అలసట, విచారం కలుగుతుంది. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలూ తలెత్తుతాయి. నిద్ర లేమి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గుదల, గుండె జబ్బులు, మధుమేహం వంటి పరిస్థితులకు దారి తీస్తుంది. అందుకే కంటి నిండా నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేమితో బాధపడుతున్న వారికి 3-2-1 రూల్ బాగా ఉపయోగపడుతుంది (3-2-1 rule help you sleep better).
3 – నిద్రపోడానికి మూడు గంటల ముందు ఆల్కహాల్ (alcohol) తీసుకోకూడదు
2 – నిద్రపోవడానికి 2 గంటల ముందు ఆహారాన్ని తినడం ఆపేయాలి.
1 – పడుకునే ఒక గంట ముందు డ్రింక్స్ తాగడం మానేయాలి
నిద్రపోడానికి మూడు గంటల ముందు ఆల్కహాల్ తీసుకోకూడదు
ఆల్కహాల్ నిద్రను తీవ్ర ప్రభావితం చేస్తుంది. అందుకే పడుకునే మూడు గంటల ముందు వరకు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల నిద్రకు భంగం కలిగించే అవకాశాలు చాలా తగ్గుతాయి. అప్పుడు మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
రెండు గంటల ముందే ఆహారాన్ని తినడం ఆపేయాలి
నిద్రపోవడానికి 2 గంటల ముందే ఆహారాన్ని తినడం ఆపడం చాలా మంచిది. ఎందుకంటే తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణవ్యవస్థలో అసౌకర్యం, యాసిడ్ రిఫ్లక్స్, బ్లడ్ షుగర్ పెరుగుదలకు దారి తీసే ప్రమాదం ఉంది. ఇది నిద్రకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. పడుకునే మందు ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి మన శరీరానికి తగిన సమయం ఇవ్వాలి. అలా చేయడం వల్ల చాలా రిలాక్స్డ్గా నిద్రపడుతుంది.
పడుకునే ఒక గంట ముందు డ్రింక్స్ తాగడం మానేయాలి
పడుకునే ముందు మంచి నీళ్లు వంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల నిద్రకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. అదెలా అంటారా..? ఉదాహరణకు పడుకునే ముందు మంచి నీళ్లు తాగారే అనుకోండి వాష్‌రూమ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందుకోసం ఏ అర్ధరాత్రో మనకు మెలుకువ వచ్చి మంచి నిద్రకు భంగం కలిగే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ నిద్రపోవడం కష్టతరంగా ఉంటుంది. ఎంతసేపటికీ నిద్ర పట్టదు. ఎలాగోలా నిద్రలోకి జారుకునేలోపే తెల్లవారిపోతుంది. అందుకే పడుకునే గంట ముందు ద్రవ పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది.
Also Read..
Melania Trump | ఆనవాయితీకి బ్రేక్.. జిల్ బైడెన్ టీ పార్టీకి మెలానియా ట్రంప్ దూరం..!
IAS Officers: క్రమశిక్షణ చర్యల కింద ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల సస్పెన్షన్
Aamir Khan | మరో పదేళ్లు పనిచేయగలను.. అమీర్ ఖాన్ కామెంట్స్ వైరల్