IAS Officers: క్రమశిక్షణ చర్యల కింద ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల సస్పెన్షన్
IAS Officers: ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను విధుల నుంచి కేరళ సర్కారు తొలగించింది. ఆ ఇద్దరిపై క్రమశిక్షణా చర్యల ప్రకారం సస్పెన్షన్ విధించారు. సస్పెండ్ అయిన వారిలో ఐఏఎస్ గోపాలకృష్ణన్, ఎన్ ప్రశాంత్ ఉన్నారు.
తిరువనంతపురం: ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను(IAS Officer) కేరళలోని విజయన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్ కే గోపాలకృష్ణన్, వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమాభివృద్ధి ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రశాంత్పై క్రమశిక్షణా చర్యల కింద వేటు వేశారు. మతం ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపును గోపాలకృష్ణన్ నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ సీనియర్ అధికారిపై ఆరోపణలు చేసి తీవ్రంగా విమర్శించిన ఘటనలో ప్రశాంత్పై చర్యలు తీసుకున్నారు. ప్రధాన కార్యదర్శి శారద మురళీధరన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేరళ సీఎం పినరయి విజయన్ ఈ చర్యలు తీసుకున్నారు.
2013 బ్యాచ్ ఆఫీసర్ అయిన గోపాలకృష్ణన్.. మల్లు హిందూ ఆఫీసర్స్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూపు నడుపుతున్నారు. అయితే తన ఫోక్ హ్యాక్ అయినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం ఆ ఫోన్ హ్యాక్ కాలేదని నిర్ధారించారు. వివాదం నేపథ్యంలో ఆ ఫోన్ను ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. అదనపు కార్యదర్శి ఏ జయతిలక్పై ఫేస్బుక్లో పోస్టు పెట్టిన 2007 బ్యాచ్ ఆఫీసర్ ప్రశాంత్పై చర్యలు తీసుకున్నారు. సీనియర్ ఆఫీసర్ ఓ సైకో అంటూ ఆయన ఆ పోస్టులో ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

