Melania Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదేశ 132 ఏండ్ల చరిత్రలో నాలుగేండ్ల విరామం తర్వాత తిరిగి ప్రెసిడెంట్ కాబోతున్న రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇక వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధ్యక్షడిగా శ్వేతసౌధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో కాబోయే ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ (Melania Trump) ఓ ఆనవాయితీని పక్కన పెట్టినట్లు తెలిసింది.
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు అనంతరం శాంతియుతంగా అధికార మార్పిడికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతున్న బైడెన్.. ఈ నెల 13న ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ఫస్ట్‌లేడీ జిల్ బైడెన్ (Jill Biden) .. కాబోయే ప్రథమ మహిళకు టీ పార్టీ (Tea Party) ఇవ్వడం ఆనవాయితీ. ఇందులో భాగంగా పార్టీకి సంబంధించిన ఆహ్వానాన్ని మెలానియా ట్రంప్‌కు వారం క్రితమే పంపారు. అయితే, ఈ పార్టీకి కాబోయే ఫస్ట్‌లేడీ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ అమెరికా మీడియా పేర్కొంది.
కాగా, అధికార బదిలీ సందర్భంగా సంప్రదాయానికి బ్రేక్ పడటం ఇదేమీ మొదటిసారి కాదు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన విషయం తెలిసిందే. అప్పుడు ఫస్ట్ లేడీగా ఉన్న మిచెల్ ఒబామా.. మెలానియాకు టీ పార్టీ ఇచ్చారు. ఆ తర్వాత 2020 ఎన్నికల ఫలితాల్లో బైడెన్ గెలుపొందారు. అప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌తో ట్రంప్ భేటీ కావాల్సి ఉండగా.. అది జరగలేదు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్ ఆరోపించారు. అప్పుడు కూడా ఈ ఆనవాయితీకి బ్రేక్ పడింది. ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ అవడం గమనార్హం.
Also Read..
Heavy Rain Alert | భారీ వర్ష సూచన.. చెన్నైలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు
Shah Rukh Khan | షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. న్యాయవాది అరెస్ట్
IAS Officers: క్రమశిక్షణ చర్యల కింద ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ల సస్పెన్షన్