Ricebran oil health benefits | గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నాణ్యమైన వంటనూనె తప్పనిసరి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉండాలన్నా, జీర్ణక్రియ సక్రమంగా జరగాలన్నా రైస్‌బ్రాన్ ఆయిల్‌ను వంటల్లో విరివిగా వాడాలని సిఫారసు చేస్తున్నారు నిపుణులు. దీన్ని వరి తవుడు నుంచి తీస్తారు. అందుకే ఈ వంటనూనెలో ఆరోగ్యకర లక్షణాలు ఎక్కువ. వాసన కూడా బావుంటుంది. ఎక్కువ మరిగించినా దుష్ఫలితాలు ఉండవు. తాలింపులకు, వేయించడానికి అత్యంత అనువైంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ఇతర వంట నూనెలతో పోలిస్తే ఇందులో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్, శాచురేటెడ్ ఫ్యాట్స్ గణనీయంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రిస్తాయి. ‘మా సంస్థ అందించే నూనెల్లో కచ్చితమైన స్థాయుల్లో ఒరైజనాల్ ఉంటుంది. వినియోగదారులకు రుచితోపాటు ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను అందించేందుకు మేం నిరంతరం ప్రయత్నిస్తాం’ అంటున్నారు ఫ్రీడమ్ రైస్‌బ్రాన్ ఆయిల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి. చంద్రశేఖర రెడ్డి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Health tips : ఈ సూపర్‌ఫుడ్‌తో సూక్ష్మ పోషకాలు సొంతం!
Foot care tips | పాదాల్లో పగుళ్లు ఉన్నాయా? ఇలా చేసి చూడండి
arthritis | ఆర్థరైటిస్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!
Lip care tips | చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి