arthritis | ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కీళ్లలో శోథగా ఆర్థరైటిస్‌ను నిర్వచించవచ్చు. ఇది చాలా సాధారణమైన అనారోగ్య సమస్య. పిల్లల నుండి పెద్దవారి వరకూ అన్ని వయస్సులవారు దీని బారిన పడవచ్చు. మరీ ముఖ్యంగా మహిళల్లో కనిపిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్, జువెనైల్ ఆర్థరైటిస్ (పిల్లల్లో), సిస్టెమిక్ లూపస్ ఎరితెమెటోసస్ (ఎస్ఎల్), షోగ్రిన్స్ సిండ్రోమ్, మయోసైటిస్ మరియు వివిధ ఇతర రుమటోలాజికల్ లాంటి వివిధ వ్యాధుల్లో ఆర్థరైటిస్ కనిపిస్తుంది. శరీరంలోని భుజాలు, మోచేతులు, మణికట్లు, తుంటి, మోకీళ్లు, చీలమండలతోపాటు చేతి, పాదం యొక్క కీళ్లలాంటి వివిధ కీళ్లకు ఆర్థరైటిస్ సంభవిస్తుంది. దీనివల్ల సాధారణంగా పలు కీళ్లు ప్రభావితమవుతాయి. కానీ, కొన్నిసార్లు ఇది ఒకటి లేదా కొన్ని కీళ్లలో ప్రారంభమై, అక్కడే స్థిరపడిపోవచ్చు. లేదా కొంతకాలం తర్వాత పలు ఇతర కొత్త కీళ్లకూ వ్యాపించవచ్చు.
ఆర్థరైటిస్ రకంపై ఆధారపడి అత్యంత సాధారణ ఆనవాళ్లు మరియు లక్షణాలు ఇలా ఉండవచ్చు.
☞కీళ్ల వద్ద వాపుతో లేదా లేకుండా కీళ్ల నొప్పి
☞ ఉదయం నిద్రలేచిన తర్వాత కీళ్లు బిగుసుకుపోవడం, అది కొన్ని గంటలపాటు వేధించడం
☞కదలికలో తగ్గుదల
l☞ వంగగల స్థితి లోపించడం
ప్రారంభ దశలోనే వ్యాధి నిర్ధారణ చేయించుకొని రుమటాలజిస్ట్ (ఆర్థరైటిస్‌ను నయం చేసే ప్రత్యేక డాక్టర్) ద్వారా వైద్యం ప్రారంభించడం చాలా ముఖ్యం. ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే కీళ్లు దెబ్బతింటాయి. కీళ్ల కదలిక మందగిస్తుంది. వైకల్యానికీ దారితీస్తాయి. సరైన చికిత్స తీసుకోనట్లయితే గుండె, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కండ్లతోపాటు ఇతర అవయవాలకూ హాని కలిగే ప్రమాదం ఉంటుంది. ఒక్కోరకం ఆర్థరైటిస్‌కు చికిత్సలో తేడా ఉంటుంది. కాబట్టి, సరైన నిర్ధారణ అత్యావశ్యకం. ప్రస్తుతం రుమటాలజిస్ట్ మార్గదర్శనం, పర్యవేక్షణలో దీర్ఘకాలంపాటు ఉపయోగపడే వివిధ సురక్షితమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాధిని సమూలంగా నివారించడానికి క్రమంతప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Health tips : ఈ సూపర్ ఫుడ్‌తో కిడ్నీలు పదిలం!
చాయ్‌తోపాటు వీటిని తీసుకుంటే అనారోగ్యం తప్పదట..!
Spondylitis diet | రోజూ ఇవి తింటే స్పాండిలైటిస్ సమస్య రానే రాదు
వంటింట్లో ఉండే వీటిని కూరలతో తీసుకుంటే ఇంత మేలు జరుగుతుందా?