చాయ్..ఈ పేరు వింటే చాలు ప్రాణం లేచివస్తుంది.. అప్పటిదాకా బద్ధకంగా ఉన్న శరీరం ఉత్తేజితమవుతుంది. అందుకే మన దేశంలో చాలామంది పొద్దున లేవగానే చాయ్ తాగుతుంటారు. ఎవరైనా అతిథులు ఇంటికొస్తే చాయ్ ఇస్తుంటారు. ఉదయం, సాయంత్రం చాయ్ తాగి రిఫ్రెష్ అవుతుంటారు. కొందరు రోజూ రెండు టీలతో సరిపెట్టుకుంటే.. మరికొందరు మూడు, నాలుగు కప్పుల దాకా తాగేస్తుంటారు. గంట గంటకూ చాయ్ తాగేవాళ్లు కూడా ఉన్నారండోయ్.. అయితే, చాయ్‌తోపాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే అసలుకే మోసం వస్తుందట. వీటిని చాయ్ తాగకముందు, చాయ్‌తో లేదా చాయ్ తాగాక తీసుకున్నా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం పదండి..