Reduce your Age | 2007లో షిన్య యమనక అనే జపాన్ శాస్త్రవేత్త… ఎలాంటి కణాన్నయినా మూలకణం కిందికి మార్చే ప్రక్రియను కనుగొన్నాడు. ఈ పద్ధతి ద్వారా తలసేమియా లాంటి జన్యుపరమైన వ్యాధులకు శాశ్వత చికిత్స లభించే అవకాశం దక్కింది. ఈ ఆవిష్కరణకు గాను ఆయనకు నోబెల్ బహుమతి దక్కింది. ఇప్పుడు ఇదే ప్రక్రియను ఉపయోగించి, ఓ కణం వయసును తగ్గించవచ్చని నిరూపించారు.
ఒక కణం విభజనకు గురయ్యే కొద్దీ, దానిలో చిన్నపాటి మార్పులు వస్తాయి. సామర్థ్యం తగ్గుతుంది. అందుకే వయసు మీరినవారిలో… గాయాలు నయం కావడానికి సమయం పడుతుంది. కీళ్ల మధ్య జిగురు తగ్గిపోవడం మొదలవుతుంది. ప్రస్తుతం కనుగొన్న ప్రక్రియ ద్వారా ఒక కణం వయసును 13 రోజుల్లోనే, 30 ఏండ్లు తగ్గించవచ్చు. ప్రయోగశాలలో మనిషిని పోలిన కణజాలం మీద ఈ ప్రక్రియను విజయవంతంగా అమలుచేశారు కూడా. దీని ద్వారా మనిషి యవ్వనంగా, దృఢంగా కనిపించడమే కాదు.. ఎలాంటి అనారోగ్యం నుంచి అయినా త్వరగా, తేలికగా బయట పడతాడని భావిస్తున్నారు.
Black Garlic | నల్ల వెల్లుల్లి ఆరోగ్యానికి మంచివేనా? అవి తింటే ఏమవుతుంది?
Pregnancy doubts | ప్రెగ్నెన్సీ సమయంలో వాంతులు ఎక్కువైతే ఆడపిల్ల పుడుతుందా?
మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా? అయితే ఈ ఆకు కూర తినండి