Antibiotics | ఇటీవల తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించాయి. దానివల్ల ఆకస్మికంగా జలుబు, దగ్గు, అతిసారం, ఫుడ్ పాయిజనింగ్, వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రజలను అతలాకుతలం చేశాయి. వీటిలో ఏ సమస్యకైనా వైద్యులు రాసేది యాంటిబయాటిక్సే. కొందరు మాత్రం వైద్యుల సిఫారసుతో సంబంధం లేకుండానే వాడుతున్నారు. దీనివల్ల శరీరానికి ఎంత నష్టం జరుగుతుందో మన ఊహకు కూడా అందదు.
♦ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ వంటివి జరిగినప్పుడు తగిన మోతాదులోనే యాంటిబయాటిక్స్ వాడాలి. దీనివల్ల శరీరంలోని హానికర సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా నాశనం అవుతుంది. మోతాదు మేరకు వాడకపోతే క్రిమి చచ్చిపోదు. దీర్ఘకాలంపాటు శరీరంపై దుష్ప్రభావం పడవచ్చు.
♦ వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎప్పుడూ యాంటిబయాటిక్స్ ఉపయోగించకూడదు. ఎందుకంటే, సరైన యాంటిబయాటిక్ వాడకపోతే బ్యాక్టీరియా బలం రెట్టింపు అవుతుంది. తర్వాత ఎన్ని మందులు వాడినా ఉపయోగం శూన్యం.
♦ కచ్చితంగా వైద్యుడు సూచించిన మోతాదులోనే వాడాలి. రోగం కొద్దిగా నయం కాగానే ఆపేస్తుంటారు కొందరు. సరైన మోతాదులో మందులు తీసుకోకపోవడం వల్ల రోగం తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది.
♦ యాంటిబయాటిక్స్ శరీరంలోని మంచి బ్యాక్టీరియాను చంపుతాయి. దీనివల్ల ఎసిడిటీ, డయేరియా, జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు. అందుకే పేగుల్లో మంచి బ్యాక్టీరియాను తిరిగి పొందేందుకు ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ తీసుకోవడం ముఖ్యం. అందుకు స్వచ్ఛమైన పెరుగు, గంజి వంటి సహజ సిద్ధ ప్రోబయోటిక్స్ ఉత్తమం.
♦ యాంటిబయాటిక్స్ తీసుకునేటప్పుడు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. దీనివల్ల శరీరం పనితీరు మరింత మెరుగుపడుతుంది.
♦ దీర్ఘకాలం యాంటిబయాటిక్స్ వాడితే.. శరీరంలోని విటమిన్-బి నశించవచ్చు. మెదడు, పేగులు, కాలేయం పనితీరు మందగించవచ్చు. ఆ నష్టాన్ని పూరించేందుకు వైద్యుని సలహాతో బీకాంప్లెక్స్ మందులు వాడాలి.
“Black Garlic | నల్ల వెల్లుల్లి ఆరోగ్యానికి మంచివేనా? అవి తింటే ఏమవుతుంది?”
మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా? అయితే ఈ ఆకు కూర తినండి”
ఏ అమ్మాయి, ఆంటీని చూసినా అలా చేయాలనిపిస్తుంది.. ఎంత ప్రయత్నించినా మానలేకపోతున్నా”
Drinking Water | నీళ్లు తక్కువగా తాగితే గుండె జబ్బులు వస్తాయా?”