Drinking Water | మంచినీళ్లు తాగితే మంచిదన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎండాకాలం తగినంత నీరు అందకపోతే… శరీరంలోని ముఖ్య అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ‘పుష్కలంగా నీరు తాగడానికి, గుండె జబ్బులకు లంకె ఉందా!’ అంటే.. ఉందనే అంటున్నారు అమెరికాలోని నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు.
ఇందులో వాస్తవాన్ని నిరూపించేందుకు 45-66 ఏండ్ల మధ్య ఉన్న 5 వేల మందిని ఎంచుకున్నారు. వీరంతా గత పాతికేండ్లుగా తమ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి వివరాన్నీ పరిశోధకులతో పంచుకున్నారు. మన రక్తంలో ‘సెరం సోడియం’ అనే రసాయనం ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గే కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది. ఆ పరిమాణాన్ని బట్టి, ఓ వ్యక్తి ఒంట్లో నీటి శాతాన్ని అంచనా వేయవచ్చు. ఆశ్చర్యంగా ఒంట్లో సెరం సోడియం నిలువలు ఎక్కువగా ఉన్నవారిలో గుండె పోటు, ధమనులు గట్టిపడటం లాంటి సమస్యలు బయటపడ్డాయి.
ఎలాంటి సందర్భాల్లో గర్భసంచిని శాశ్వతంగా తీసేయాల్సి వస్తుంది?
ఎలా పడితే అలా స్నానం చేయొద్దు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
Health Tips | తీవ్ర మానసిక అలజడితో గుండె జబ్బుల ముప్పు”
“Heart Health | కరోనాకు గురైతే గుండెపోటు బారినపడినట్టేనా?”