Coronavirus : మాస్కులు వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు అవసరం
కరోనా సోకకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ తప్పనిసరి. బయటకు వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా సోకకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ తప్పనిసరి. బయటకు వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు కరోనా వైరస్ విజృంభణ ఎక్కువ అయిన నేపథ్యంలో ఇప్పుడు రెండు మాస్కులు వాడితే ఇంకా మంచిదని చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు ఏ మాస్క్ ఎప్పుడు వాడాలి? మాస్క్ వాడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఎలాంటి మాస్కులు ఎంచుకోవాలి?
- సర్జికల్ మాస్క్ అయినా క్లాత్ మాస్క్ అయినా మూడు లేయర్లు ఉన్నవే ఎంచుకోవాలి.
- బట్ట మాస్కులను ఎంచుకున్నప్పుడు సులభంగా శ్వాస తీసుకునేందుకు వీలు ఉండే మాస్కులను తీసుకోవాలి.
- మాస్క్ మొహం నిండా సరిపోయేలా ఉండాలి. అంటే ముక్కు, నోరు, గడ్డం భాగం పూర్తిగా కవర్ అయ్యేలా ఉండాలి.
- ముక్కు దగ్గర స్ట్రిప్ ఉండే మాస్కులను ఎంచుకోవడం మంచిది. ఈ స్ట్రిప్ ఉండటం వల్ల బయట గాలిని మనం పీల్చుకోకుండా జాగ్రత్త పడొచ్చు.
చిన్నారులకు..
రెండేళ్లలోపు చిన్నారులకు మాస్క్ అవసరం లేదు. రెండేళ్లు దాటిన చిన్న పిల్లలకు బట్ట మాస్క్‌ను ఎంచుకుంటే అవి వారి ముఖానికి ఫిట్ అయి బిగుతుగా ఉండేలా చూసుకోవాలి.

ఈ జాగ్రత్తలు పాటించండి.
- మాస్క్ పెట్టుకునేముందు, తీసిన తర్వాత కచ్చితంగా చేతులను శానిటైజ్ చేసుకోవాలి.
- మాస్క్ పెట్టుకునేందుకు లేదా తీసేప్పుడు కేవలం మాస్క్‌కు ఉన్న దారాన్ని మాత్రమే పట్టుకోవాలి. మాస్క్‌ను పట్టుకోకూడదు.
- తరచూ మాస్క్‌ను పట్టుకోవడం కూడా మంచిది కాదు. ఎప్పుడైనా మాస్క్‌ను పట్టుకోవాలన్నా చేతులను శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి.
- మనం పెట్టుకునే మాస్క్ కచ్చితంగా ముక్కు, నోరు, గడ్డం భాగాన్ని కవర్ చేసేలా ఉండాలి.
- మొఖానికి సరిపోయేలా ఫిట్‌గా ఉండాలి.

మాటిమాటికీ తీయొద్దు
ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ పెట్టుకుంటే.. తిరిగి ఇంటికి వచ్చేవరకు మాస్క్‌ను తీయొద్దు. కొంతమంది ఫోన్లో మాట్లాడేప్పుడు, బండిపై వెళ్లేటప్పుడు ఇలా పలు సందర్బాల్లో మాస్క్‌ను గడ్డం కిందకు అంటుంటారు. అలా చేయడం వల్ల మాస్క్ పెట్టుకుని ప్రయోజనం ఉండదు.

మాస్కుల విషయంలో జాగ్రత్త
బట్టతో తయారుచేసిన మాస్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అసలే ఎండాకాలం కాబట్టి మాస్క్ ధరించినప్పుడు చెమట పట్టేస్తుంది. అయితే బట్ట మాస్కులు తొందరగానే చెమటను పీల్చేస్తాయి. కాకపోతే అలా చెమటతో నిండిన మాస్కులతో అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ. చెమటతో తడిచిన మాస్కులపై క్రిములు, బ్యాక్టీరియా కూడా త్వరగా చేరతాయి. కాబట్టి చెమట పట్టిన మాస్కులను వెంటనే తీసేయాలి.

సరిగ్గా శుభ్రపరచాలి
మాస్క్‌ను వాడటమే కాదు.. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒకసారి మాస్క్‌ను ఉపయోగించిన తర్వాత డెటాల్ వేసిన వేడి నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత మాస్క్‌ను ఉతికి ఎండలో ఆరేయాలి. ఉతికాం కదా అని ఒకరి మాస్క్ మరొకరు వాడకూడదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

