బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Jun 23, 2020 , 10:05:23

చెయ్యి వణుకు.. ఎందుకు?

చెయ్యి వణుకు.. ఎందుకు?

నా వయసు 60 సంవత్సరాలు. బీపీ, షుగర్‌ లాంటి వ్యాధులేమీ లేవు. కానీ ఏడాది కాలంగా బాగా నెమ్మదిస్తున్నాను. కుడి చెయ్యి వణుకుతూ ఉంటుంది.  నా సమస్యకు పూర్తి పరిష్కారం ఉందా?

- సుజాత, జగిత్యాల

మీరు పార్కిన్‌సన్స్‌ వ్యాధితో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ జబ్బు 60 సంవత్సరాలు నిండినవారిలో ఎక్కువ. కూర్చుని ఉన్నప్పుడు చెయ్యి వణకడం, తొందరగా నడవలేకపోవడం, కూర్చునేటప్పుడు గబుక్కున ఒక చెయ్యి దిమ్మ మాదిరిగా కావడం, ఎవరన్నా వెనుక నుండి పిలిచినా, ఏ పని కోసమైనా వెంటనే వెనక్కి తిరగలేకపోవడం, ముఖంలో కదలికలు లేకపోవడం, నోటి నుంచి ఉమ్మి కారిపోవడం.. వంటివి ఈ జబ్బు లక్షణాలు. మెదడులో డోపనిన్‌ అనే రసాయనం మందగించడం వల్ల మనిషిలో కదలికలు తగ్గిపోతాయి. దీన్ని టాబ్లెట్‌ రూపంలో ఇవ్వడం ద్వారా నడిచేటట్లు చేయవచ్చు. సిండోపా, రోపార్క్‌, పాసిటోన్‌ వంటి మందులతో ఈ జబ్బుకి వైద్యం చేయవచ్చు. మందులు వాడుకుంటూ 10 నుంచి 15 సంవత్సరాల వరకు వాళ్ల పని వాళ్లు చేసుకునే అవకాశం ఉంటుంది. అయిదు నుంచి ఏడు సంవత్సరాలు గడిచాక మందులు సరిగా పనిచేయకపోతే డిబిఎస్‌ అనే సర్జరీ ద్వారా మంచి ఫలితం సాధించవచ్చు. మీరు ఒక సంవత్సరం నుంచీ బాధపడుతున్నారు కాబట్టి, మందులతో మీ జబ్బును నయం చేయవచ్చు. 

  • డాక్టర్‌ మురళీధర్‌ రెడ్డి
  • కన్సల్టెంట్‌ న్యూరాలజిస్టు
  • కేర్‌ హాస్పిటల్స్‌,హైదరాబాద్‌


logo