శనివారం 04 ఏప్రిల్ 2020
Health - Jan 27, 2020 , 23:14:41

నోటిలో పుండు.. మానేందుకు చిట్కాలు

నోటిలో పుండు.. మానేందుకు చిట్కాలు

ఏమీ తిననివ్వకుండా, తాగనివ్వకుండా ఇబ్బంది పెట్టే సమస్య మౌత్‌ అల్సర్‌. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలోనూ ఇవి కనిపిస్తుంటాయి. దంతాలు నోటి లోపలి చర్మానికి గుచ్చుకోవడం, బ్రష్‌ చేసేటప్పుడు టూత్‌ బ్రష్‌ తగిలి గాయం కావడం, బాగా వేడి చేసినప్పుడు, నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం, విటమిన్స్‌ లోపం, మానసిక ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవడం, డీహైడ్రేషన్‌ లాంటి కారణాల వల్ల మౌత్‌ అల్సర్లు వస్తుంటాయి. వీటి నుంచి బయటపడడానికి కొన్ని చిట్కాలు అందిస్తున్నారు నిపుణులు.

మౌత్‌ అల్సర్‌ ఉన్నప్పుడు విటమిన్‌ సి అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. ఆరెంజ్‌, జామ, స్ట్రాబెర్రీ, బొప్పాయి లాంటి పండ్లలో సి విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. విటమిన్‌ సి సప్లిమెంట్లను టాబ్లెట్స్‌ లేదా పిల్స్‌ రూపంలో తీసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. 

ప్రతిరోజూ పెరుగు తినడం లేదా రెండు మూడు గ్లాసుల మజ్జిగ తాగడం వల్ల చెడు బాక్టీరియా పోతాయి. 

పచ్చి టొమాటోలను తింటే కూడా నోటి అల్సర్లు తగ్గుముఖం పడుతాయి. పెద్ద టమాట అయితే ఒకటి, చిన్నవి అయితే 5 తినాలి. వీటిని అల్సర్‌ ఉన్నవైపు కాకుండా మరోవైపు బాగా నమిలి రసం నోట్లో ఉండేలా తినాలి. 

టూత్‌ బ్రష్‌ ను ప్రతి ఆరు నెలలకు ఒకసారి మార్చాలి. పాతదాన్ని వాడితే అందులో బాక్టీరియా ఉండి అల్సర్‌ కు కారణం అవ్వొచ్చు.

ఇవి తినొద్దు - స్పైసీగా ఉన్న ఫుడ్‌ తీసుకోవద్దు. వేపుళ్లకు దూరంగా ఉండాలి. అల్సర్‌ ఉన్నప్పుడు చేపలు, చికెన్‌ లాంటి మాంసాహారం తినొద్దు.

కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌, ఆల్కహాల్‌ వంటి వాటి జోలికి వెళ్లొద్దు. 

ప్రతిరోజూ మూడు నాలుగు సార్లు కొబ్బరినీళ్లతో నోటిని గార్గిల్‌ చేయాలి.

మౌత్‌ అల్సర్స్‌ కు ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్‌ మౌత్‌ అల్సర్‌ ను తగ్గిస్తుంది. కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగా ఉండే సలాడ్స్‌ తీసుకోవడం మంచిది. 

కొబ్బరి పాలు తీసుకుని వాటిలో కొద్దిగా తేనె కలిపి మౌత్‌ అల్సర్‌ ఉన్న భాగంలో అప్లయ్‌ చేయాలి. 

ఎండు కొబ్బరి నమిలి కొద్దిసేపు నోట్లో అలాగే పెట్టుకోవాలి. కొబ్బరి నూనెను 5 నుంచి 10 నిమిషాలు పుక్కిళించినా ఫలితం ఉంటుంది. 


logo