శంషాబాద్ రూరల్, అక్టోబర్ 15 : ఈ మధ్య కాలంలో రోగుల ప్రాణాలు తీస్తున్న ఆర్ఎంపీ వైద్యం శంషాబాద్‌లో మరో యువతి ప్రాణాన్ని బలితీసుకుం ది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగర శివారు ప్రాంతాల్లో కొందరు ఆర్ఎంపీ వైద్యు లు స్పెషాలిటీ వైద్యులుగా చలామని అవుతూ ఏకంగా అబార్షన్లు, సర్జరీలు వంటివి కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చీ రాని వైద్యంతో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం .. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ గ్రామానికి చెందిన మధుసూదన్ శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో హాంగార్డుగా పని చేస్తున్నాడు.
కాగా పారుఖ్నాగర్ మండలం, రాయికల్ గ్రామానికి చెందని మౌనిక(29) ప్రైయివేట్ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతుంది. అయి తే మధుసూదన్, మౌనికలు గత 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో మధుసూదన్ సదరు యువతితో పలుమార్లు శారీరకంగా కలిశాడు. దీంతో ఇటీవల యువతి గర్భందాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలని యువతి హోం గార్డుపై వత్తిడి తేవడం తో ముందుగా అబార్షన్ చేయించుకోవాలని, ఆ తరువాత పెళ్లి చేసుకోవచ్చని యువతిని నమ్మించాడు.
అంతే కాకుండా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ పద్మజా వద్దకు యువతిని తీసుకువచ్చి, గర్భం తీయడం కో సం ఆపరేషన్ చేయించాడు. డబ్బు ఆశకు ఆర్ఎంపీ చేసిన ఆపరేషన్ వికటించడంతో యువతి తీవ్ర రక్తస్రావానికి గురైంది. దీంతో ఆందోళనకు గురైన మధుసూదన్ బాధితురాలిని నగరంలోని ఓ ప్రైయివేట్ దవాఖానకు తరలించి చికిత్స చేయించగా, చికిత్స పొందుతూ మౌనిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మౌనిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫి ర్యాదు చేయడంతో శంషాబాద్ పోలీసులు కేసు న మోదు చేసుకుని హోంగార్డు మధుసూదన్‌తో పాటు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజను ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా పెళ్లి కాకుండానే యువతిని గర్భవతిని చేసి, ఆమె మృతికి కారణమైన హోం గార్డుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.