ట్రిపులార్ అలైన్‌మెంట్‌ను తక్షణమే మార్చి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ట్రిపులార్ కొత్త అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తలకొండపల్లి మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో సీపీఎం ఆధ్వర్యం లో భూనిర్వాసితులు రిలేదీక్షలను ప్రారంభించారు. సీపీఎం మండల కార్యదర్శి కురుమయ్య అధ్యక్షతన బాధిత రైతులు చేపట్టిన రిలే దీక్షకు యాదయ్య సంఘీభావం తెలిపి మాట్లాడారు. బడానాయకులు, భూస్వాముల భూములను కాపా డేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిపులార్ నూతన అలైన్‌మెంట్‌ను రూపొందించిందన్నారు.
సన్న, చిన్న కారు రైతుల భూములను లాక్కోవడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రియల్టర్లకు మేలు చేసేలా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ట్రిపులార్ అలైన్‌మెంట్‌ను ప్రతిపాదించారని ఆరోపించారు. నూతన అలైన్మెంట్ రూపొందించడంలో ఎమ్మె ల్యే భాగస్వామ్యం లేకపోతే… తక్షణమే ఆయన భూనిర్వాసితులను కలిసి సం ఘీభావం తెలపాలన్నారు. తమది రైతు లు, పేదల పక్షాన ఉండే ప్రభుత్వామని గొప్పలు చెప్పే రేవంత్‌రెడ్డి.. పేదల నుం చి బలవంతంగా భూములను తీసుకోవడమేంటన్నారు.
ప్రభుత్వం వెంటనే పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపులార్‌ను నిర్మించాలని.. లేకుంటే భూనిర్వాసితులతో కలిసి పెద్ద ఎత్తున ఆం దోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాగా, ట్రిపులార్ బాధితులు చేపట్టిన రిలే దీక్షకు బీఆర్ఎస్ నాయకులు కలిసి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, సీపీఎం ఆమనగల్లు మండల కార్యదర్శి శివశంకర్, నాయకులు వెంకటయ్య, చెన్నయ్య, పోచయ్య, దైవానందం, మల్లేశ్, మాజీ సర్పంచ్‌లు వెంకటస్వామి, జయమ్మావెంకటయ్య, లింగంగౌడ్, మాజీ ఎంపీటీసీలు లక్ష్మయ్య, గౌడ సంఘం మండలాధ్యక్షుడు బాలకుమార్‌గౌడ్, భూపోరాట కమిటీ అధ్యక్షుడు పరమేశ్, రైతులు మల్లేశ్, యాదగిరి, నవీన్, మాధవరెడ్డి, యాదయ్య, రాజు, ధర్మారెడ్డి, సుధాకర్, మహేశ్, వెంకటయ్య, విజయ్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.