మాదాపూర్, అక్టోబర్ 15: మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతై న ఉందని కన్సల్టెంట్ బ్రెస్ట్ అంకాలజిస్ట్, ఎండోక్రైన్ సర్జన్, రోబోటిక్ సర్జన్, డాక్టర్ రమ్య అన్నారు. అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్‌ను పురస్కరించుకొని కొండాపూర్‌లోని కిమ్స్ దవాఖానలో బుధవారం రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ … రొమ్ము క్యాన్సర్ అనేది నిశ్శబ్ద మహమ్మారి కాదని, ఇది కొత్త డయాబెటిస్ అని అన్నారు. రొమ్ము క్యాన్సర్‌తో నానాటికి మరణాల సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపారు.
మహిళలకు రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది మహిళల్లో ఈ వ్యాధి గుర్తించబడినట్లు తె లిపారు. 1 లక్షకు పైగా మహిళలు దీని కారణంగా ప్రా ణాలు కోల్పోతున్నారన్నారు. మన దేశంలో 1.8 మిలియన్ల మంది ఈ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ట్లు చెప్పారు. ప్రతి 24 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడంతో అనేక మంది మహిళలు మరణిస్తున్నారన్నా రు. రొమ్ము క్యాన్సర్లు అధికంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలు ఆమె చెప్పారు.
దేశ వ్యాప్తంగా స్క్రీనింగ్ కార్యక్రమం లేకపోవడం, క్యాన్సర్ చికిత్సకు సమాన అవకాశాలు లేని పరిస్థితి, ప్రత్యేకంగా గ్రామీణ భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ఇంకా రహ స్య సమస్యగా మిగిలిందన్నారు. రొమ్ము లోపల గట్టి ముద్ద, గడ్డలా మారడం, రొమ్ము ఆకారం పరిమాణం లేదా రూపంలో మార్పు, రొమ్ము చర్మంపై డింప్లిండ్, పిట్టిం గ్ (నారింజ తొక్క లాగా కనిపించడం), చను మోన లోపలికి వెళ్ళడం, చనుమొలు రూపాన్ని మార్చ డం, చనుమొల నుంచి ద్రవం కారడం, రొమ్ము చంక లో నొప్పి తగ్గకపోవడం వంటి లక్షణాలు రొమ్ము క్యాన్సర్‌కు దారితీయనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఒకసారి మమోగ్రఫీ, ప్రతి ఆరు మాసాలకు ఒకసారి బ్రెస్ట్ నిపుణులతో క్లినికల్ పరీక్షను చేయించుకోవడం, నెలకు ఒకసారి రొమ్ము స్వీయ పరీక్ష చేయించుకోవడం మంచిదన్నారు.