e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021

రియల్‌ మాయ

  • ఎకరాల్లో కొని.. గుంటల్లో విక్రయం
  • ఫాం ల్యాండ్స్‌ పేరిట నయా దందా
  • రైతుబంధు, బీమా వర్తింపు అంటూ అమ్మకాలు
  • నాయకుల ఫిర్యాదుతో కదులుతున్న డొంక

మూసాపేట, ఆగస్టు 3 : అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి.. గంటల లెక్కన విక్రయిస్తూ అటూ ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను మోసం చేస్తున్నారని మూసాపేట జె డ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌, ఎంపీపీ కళావతి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు జమీర్‌ చేసిన ఫిర్యాదుతో ఫాం ల్యాండ్‌ నిర్వాహకుల డొంక కదులుతున్నది. ఈ ఫిర్యాదుతో ఫాం ల్యాండ్‌ రిజిస్ట్రేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయా యి. మూసాపేట మండలంలోని దాసరిపల్లి గ్రామం చెన్నంపల్లి స మీపంలో ‘పాలమూరు ప్రకృతి వనం’ పేరుతో సుమారుగా 100 ఎకరాలకు పైగా ఫాం ల్యాండ్‌ పేరుతో 1, 2 గుంటల మేర ప్లాట్లుగా మార్చి రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ వ్యవహరంపై నాయకులు అధికారులకు జనవరిలో ఫిర్యాదు చేశారు.

దీంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయా యి. ఈ క్రమంలో కొమిరెడ్డిపల్లి గ్రామ శివారులోని వేముల కో జెంట్‌ గ్లాస్‌ పరిశ్రమ ఎదుట సుందరవనం పేరుతో 60 ఎకరాల్లో ఫాం ల్యాండ్లను విక్రయించారు. ఈ విషయంపై కూడా నాయకులు ఫిర్యాదు చేశారు. ఫాం ల్యాండ్ల రిజిస్ట్రేషన్లు ఆపడానికి తమకు ఎ లాంటి అధికారులు లేవని అధికారులు చెప్పారు. అలాగే నందిపేట గ్రామంలో కేఎస్‌ఆర్‌ నందనవనం పేరుతో 40 ఎకరాల్లో మరో ఫాం ల్యాండ్‌ ఏర్పాట్లు చేస్తుండగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఆర్డీవో, డీపీవోలకు ఫిర్యాదులు చేశారు. మరో వైపు ఫిర్యాదు పత్రాల రిసీవింగ్‌ కాపీలను తీసుకొని కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

ఫిర్యాదు విషయంపై కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించి విచారణ చేపట్టారు. ఫిర్యాదులోని వివరాలు వాస్తవాలే అని తేలడంతో ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఫాంల్యాండ్‌ల పేరుతో 20 గుంటలకు తక్కువగా ఉంటే రిజిస్ట్రేషన్లు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. అడ్డాకుల మండలంలోని శాఖాపూర్‌ గ్రామంలో శ్రీ భారతి పేరుతో ఏర్పాటు చేస్తు న్న ఫాం ల్యాండ్ల వద్ద తాసిల్దార్‌ కిషన్‌ ఆదేశాలతో బోర్డులు ఏర్పా టు చేశారు. రెవెన్యూ కార్యాలయంలో కూడా ‘20 గుంటలకు త క్కువ భూమి ఉంటే రిజిస్ట్రేషన్లు చేయబడవు’ అని బోర్డులు బిగించారు. కాగా, రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో డబ్బులు చెల్లించిన బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, కొమిరెడ్డిపల్లిలో దాదా పు 8 ఎకరాలు, నందిపేటలో చెరువుకు వచ్చే పాటు కాల్వలను ఆక్రమించి గుంటలుగా మార్చి అమ్ముతున్నారని జెడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్‌ తెలిపారు. ఇదేంటని అడిగేందుకు వెళ్తే ఎవరు పట్టించుకోవడం లేదన్నా రు. దీంతో ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేశామన్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి..
ఫాం ల్యాండ్ల ఏర్పాటుతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతోపాటు, గ్రామ పంచాయతీకి తీరని నష్టం జరుగుతుంది. డీటీసీపీ లే అవుట్‌ చేయాలంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూ మిగా మార్చాలి. ప్లాట్లలో ప్రజలు నివాసం ఉండేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజులు ఎక్కువగా చెల్లించాల్సి ఉం టుంది. లే అవుట్‌ స్థలంలో పార్కులు, విశాలమైన రోడ్లు, ఆలయా లు, పాఠశాలల నిర్మాణాలకు 10 శాతం ల్యాండ్‌ కేటాయించాలి. కానీ ఫాం ల్యాండ్ల పేరిట ప్లాట్లుగా చేసి.. ఇవేవీ పట్టించుకోవడంలే దు. దీంతో అటు ప్రభుత్వానికి, ఇటు గ్రామ పంచాయతీకి నష్టం వాటిల్లుతున్నది. ఫాం ల్యాండ్లు డీటీసీపీ లే అవుట్ల కంటే సగం ధర కు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా పట్టాదారు పాస్‌బుక్కు వస్తుం ది. దీంతో రైతుబీమా, రైతుబంధు వర్తిస్తుందని నిర్వాహకులు ప్ర చారం చేయడంతో ప్రజలు ఆకర్షితులవుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana