e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home జోగులాంబ(గద్వాల్) చురుగ్గా కాలువ మరమ్మతు పనులు

చురుగ్గా కాలువ మరమ్మతు పనులు

  • పసుపుల బ్రాంచ్‌ కెనాల్‌ బ్యాంకింగ్‌ ఎత్తు పెంపు..
  • కొనసాగుతున్న కంపచెట్లు, జమ్ము తొలగింపు
  • చివరి ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం
  • ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి రైతుల కృతజ్ఞతలు

కోడేరు, సెప్టెంబర్‌ 14 : ఎంజీకేఎల్‌ఐలో భాగంగా మండలంలోని పసుపుల బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా చివరి ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా చేపట్టిన బ్యాం కింగ్‌ ఎత్తు పెంపు, కాలువలో కంపచెట్లు, జమ్ముగడ్డి తొ లగింపు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చొరవతో పనుల్లో వేగం పెరిగింది. కాగా, పసుపుల బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా కోడేరు, పాన్‌గ ల్‌ మండలాల్లోని 34 వేల ఎకరాలు, పెద్దకొత్తపల్లి మం డలం జొన్నలబొగుడ నుంచి కల్వకోలు వరకు 12 వేల ఎకరాలు మొత్తం 46 వేల ఎకరాలకు సాగునీరందాల్సి ఉన్నది.

కాలువ ఎత్తు తక్కువగా ఉండడంతో చివరి ఆ యకట్టుకు నీరందడం లేదు. కాలువ గేట్లు ఎత్తితే కట్టలు ఎక్కి పారుతున్నాయి. దీనికితోడు ఐదేండ్ల కిందట త వ్విన కాలువలో జమ్ముగడ్డి, కంపచెట్లు దట్టంగా పెరిగా యి. ఈ విషయాన్ని రైతులు ఎమ్మెల్యే బీరం దృష్టికి తీ సుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే గత నెలలో కాలువల వెంట సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు. ఎంజీకేఎల్‌ఐ డీ-5, డీ-8 ద్వారా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించి నీళ్లు వదలాలని, లేకుంటే గేట్ల వద్ద ధర్నా చేస్తానని హెచ్చరించారు.

- Advertisement -

చేసిన పనులకు నే టికీ బిల్లులు రాలేదని, పనులు చేయలేమని ఏజెన్సీ వా రు చెప్పడంతో.. ఎమ్మెల్యే సొంతంగా ఏడు యంత్రాల ను ఏర్పాటు చేయించి పనులు చేపడుతున్నారు. ప్రస్తు తం పసుపుల శివారులో ఐదు కిలోమీటర్లు, నాగులపల్లి శివారులో 12.9 కి.మీ, పాన్‌గల్‌ మండలం శాఖాపూర్‌ శివారులో 26 కిలోమీటర్ల వరకు కాలువ బ్యాంకింగ్‌ ఎత్తు పెంపు, జమ్ముగడ్డి, కంపచెట్ల తొలగింపు పనులు జరుగుతున్నాయి. దీంతో ఆయా మండలాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana