e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home జోగులాంబ(గద్వాల్) త్వరలో అర్హులకు కొత్త పింఛన్లు

త్వరలో అర్హులకు కొత్త పింఛన్లు

  • అర్హులందరికీ రేషన్‌కార్డులు గత అసెంబ్లీ సమావేశాల్లోనే ‘దళితబంధు’ ప్రకటన
  • రేషన్‌కార్డుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మహేశ్‌రెడ్డి

నవాబ్‌పేట, జూలై 26: అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం విడుతల వారీగా కొత్త రేషన్‌కార్డులు అందజేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రేషన్‌కార్డుల పంపిణీకి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరై లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. హరిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నారన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే దళితబంధు పథకం అమలు చేయనున్నట్లు తెలిపారని గుర్తుచేశారు. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే దళితబంధు పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రతిపక్షాలు చెప్పడం అర్థరహితమన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ పట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ నర్సింహులు, తాసిల్దార్‌ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, మార్కెట్‌ చైర్మన్‌ డీఎన్‌రావు, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గండు చెన్నయ్య, వైస్‌ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, సర్పంచ్‌ గోపాల్‌గౌడ్‌, ఎంపీటీసీ రాధాకృష్ణ, కోఆప్షన్‌ సభ్యుడు తాహెర్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శీనయ్య, ఎంపీటీసీలు గోపీకృష్ణ, గోపాల్‌, మురళీధర్‌రెడ్డి, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్‌, గోపాల్‌, శ్రీను, సంజీవరెడ్డి, భోజయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, జూలై 26: అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు ఇస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జడ్చర్ల పట్టణంలోని చంద్రాగార్డెన్స్‌లో లబ్ధిదారులకు రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరికీ రేషన్‌కార్డులు వస్తాయని, రాని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంగీతనాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, జెడ్పీ వైస్‌చైర్మన్‌ యాదయ్య, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ కాట్రపల్లి లక్ష్మయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, లక్ష్మీరవీందర్‌, తాసిల్దాన్‌ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో స్వరూప, ఆర్‌ఐలు రాఘవేంద్ర, సుదర్శన్‌రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ సారిక, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ సుదర్శన్‌గౌడ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ గోవర్ధ్దన్‌రెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మురళి, బీకేఆర్‌, సత్యం, ఇమ్మూ, రామ్మోహన్‌, మసియొద్దీన్‌, సర్పంచులు బాలసుందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, కొండల్‌, రవిగౌడ్‌ పాల్గొన్నారు.

- Advertisement -

గండీడ్‌, మహ్మదాబాద్‌ మండలాల్లో..
గండీడ్‌/మహ్మదాబాద్‌, జూలై 26: రేషన్‌కార్డుల పంపిణీ లో ఎలాంటి అపోహాలకు లోను కావొద్దని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గండీడ్‌, మహ్మదాబాద్‌ మండలాల్లో అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. రేషన్‌కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, కార్డు రానివారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే వస్తుందని తెలిపారు. మొదటి, రెండో విడుత, మూడో విడుత కార్డుల పంపిణీ ఉంటుందన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నదని తెలిపారు. మహ్మదాబాద్‌లో 210, గండీడ్‌లో 185 రేషన్‌కార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ కమతం శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ లక్ష్మీనారాయణ, వైస్‌ ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్‌, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, సర్పంచులు పార్వతమ్మ, చంద్రకళ, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు గోపాల్‌, ఎంపీటీసీలు చెన్నయ్య, బాలయ్య, తాసిల్దార్లు జ్యోతి, రాంభాయి, నాయకులు గోపాల్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, బాలవర్ధన్‌రెడ్డి, అశోక్‌గౌడ్‌, భిక్షపతి, తిర్మల్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, జోగుకృష్ణ, రేషన్‌డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి
బాలానగర్‌, జూలై 26: అర్హులైన ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కమల పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వాల్యానాయక్‌, జెడ్పీటీసీ కల్యాణి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, గిరిజన రాష్ట్ర నాయకులు లక్ష్మణ్‌నాయక్‌, తాసిల్దార్‌ రవీంద్రనాథ్‌, ఆర్‌ఐ వెంకట్రాములు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు వెంకటయ్య, సర్పంచుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి శంకర్‌, ఫిర్యానాయక్‌, రవినాయక్‌, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana