e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జోగులాంబ(గద్వాల్) జూరాల గేట్లెత్తారు

జూరాల గేట్లెత్తారు

  • ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి భారీగా వరద
  • నిండుకుండలా జూరాల ప్రాజెక్టు
  • 67 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 66 వేల క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో
  • ఏడు గేట్ల ద్వారా శ్రీశైలానికి నీటి విడుదల
జూరాల గేట్లెత్తారు

ఆత్మకూరు, జూలై 17 : ఎగువ నుం చి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకున్నది. మొత్తం 9.657 టీఎంసీలకు గానూ శనివారం మధ్యాహ్నానికే 9.214 టీఎంసీలకు చేరుకున్నది. దీంతో ఈ ఏడాది మొదటిసారి గా ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ఏడు గేట్లు మీటర్‌ చొప్పున ఎత్తి 29,078 క్యూసెక్కులను దిగువకు వదిలారు. అలాగే నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, కుడి కాలువకు 200, స మాంతర కాలువకు 150, విద్యుదుత్పత్తికి 36,659 క్యూసెక్కులు విడుదల చే శారు. రాత్రి 9 గంటల వరకు ఎగువ నుంచి 67,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, దిగువకు 66,749 క్యూసెక్కులు వదిలారు. ఎగువ జూరాలలో ఐదు యూనిట్లు, దిగువ జూరాలలో ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా కొనసాగుతు న్న విద్యుదుత్పత్తితో ఎగువ జూరాలలో 3.33, దిగువ జూరాలలో 3.69 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. మొత్తంగా ఈ ఏడాది సీజన్‌లో ఎగువ జూరాలలో 30.814, దిగువ జూరాల లో 35.95 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.

టీబీ డ్యాంకు భారీ వరద
అయిజ, జూలై 17 : కర్ణాటకలోని ఎ గువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శనివారం ఇన్‌ ఫ్లో 48,835, అవుట్‌ఫ్లో 291 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు, నిల్వ 100. 855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 161 3.24 అడుగుల్లో 41.834 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు విశ్వనాథ్‌ తెలిపారు.

- Advertisement -

ఆర్డీఎస్‌ ఆనకట్టకు..
ఆర్డీఎస్‌ ఆనకట్టకు 876 క్యూసెక్కు లు వస్తుండగా.. కన్‌స్ట్రక్షన్‌ స్లూయీస్‌, స్కవర్‌ స్లూయీస్‌ గేట్ల ద్వారా దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి 1,350 క్యూ సెక్కులు చేరుతున్నట్లు కర్ణాటక జేఈ శ్రీ నివాస్‌ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 4 అడుగుల నీరు నిల్వ ఉన్నది.

శ్రీశైలంలో పెరిగిన నీటిమట్టం
శ్రీశైలం, జులై 17 : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తున్నది. ఒక్క రోజులోనే రిజర్వాయర్‌లో ఐదు అడుగు ల మేర నీటినిల్వ పెరిగింది. శనివారం రాత్రి జూరాల విద్యుదుత్పత్తి ద్వారా 36,096, గేట్ల ద్వారా 29,078, సుంకే సుల ద్వారా 2,231 క్యూసెక్కులు విడు దల చేయగా, 38,364 క్యూసెక్కులు రిజర్వాయర్‌కు వచ్చి చేరినట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. జలాశయం పూ ర్తిస్థాయి సామర్థ్యం 215.807 టీఎంసీ లు కాగా ప్రస్తుతం 36.5046 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 813.60 అ డుగులకు చేరింది.

రామన్‌పాడు గేట్లు ఎత్తివేత
మదనాపురం, జూలై 17 : ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటికి రా మన్‌పాడు ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నది. ప్రాజెక్టులో నీటిమట్టం పెరగడంతో శనివారం రెండుగేట్లను ఎత్తి దిగువకు విడదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ రనీల్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పరీవాహక ప్రాంత రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మండలంలోని దంతనూరు, శం కరమ్మపేట గ్రామాల మధ్య ఊకచెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తపల్లి పల్లెప్రకృతి వనంలో నీరు నిలిచింది.

సరళాసాగర్‌ ప్రాజెక్టుకు నీరు
కొత్తకోట, జూలై 17 : మండలంలో ని కనిమెట్ట, పాత జంగమాయపల్లి గ్రా మాల మధ్య వాగు పరవళ్లు తొక్కుతున్న ది. ఈ నీరంతా సరళాసాగర్‌ ప్రాజెక్టులో కి చేరుతున్నది. దీంతో రైతులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. తుకాలు పోసుకొని వరి నాట్లకు సిద్ధమవుతున్నారు. వాగులో మత్స్యకారులు ఉత్సాహంగా చేపలు పట్టారు. సరళాసాగర్‌ ప్రాజెక్టును ఎంపీపీ మౌనిక, మాజీ వైస్‌ ఎంపీపీ మల్లేశ్‌, పరమేశ్‌ పర్యవేక్షించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జూరాల గేట్లెత్తారు
జూరాల గేట్లెత్తారు
జూరాల గేట్లెత్తారు

ట్రెండింగ్‌

Advertisement