e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home జిల్లాలు వెనుకబడిన తరగతులకు 27 శాతం వాటా ఇవ్వాలి

వెనుకబడిన తరగతులకు 27 శాతం వాటా ఇవ్వాలి

వెనుకబడిన తరగతులకు 27 శాతం వాటా ఇవ్వాలి

కేంద్ర బీసీ సంక్షేమ సాధికారిక కమిటీ సభ్యుడు ఆచారి తల్లోజు
నారాయణపేట టౌన్‌, ఏప్రిల్‌ 16 : ప్రభుత్వాలు అమ లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వెనుకబడిన తరగతులకు రావాల్సిన 27శాతం వాటా తప్పనిసరిగా ఇ చ్చే విధంగా అన్ని ప్రభుత్వ శాఖలు పని చేయాలని కేంద్ర బీసీ సంక్షేమ సాధికారిక కమిటీ సభ్యుడు ఆచారి తల్లోజు అన్నారు. సామాజిక న్యాయం, సాధికారత కమిటీ మంత్రి త్వ శాఖ తరపున బీసీ సంక్షేమ సాధికారక కమిటీ సభ్యులు శుక్రవారం జిల్లాలో పర్యటించి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో బీసీలకు ఎంత మేరకు లబ్ధి చేకూర్చారో శాఖల వారీగా ఆరా తీశారు. 19 54 నుంచి జిల్లాలో మొత్తం ప్రభుత్వ భూమి ఎంత, అం దులో పేదలకు ఇచ్చిన భూమి ఎంత, ఇచ్చిన ప్రభుత్వ భూమిని కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం, ఇతర కారణాల వల్ల ఎంత మందితో ఎన్ని ఎకరాలు సేకరించారో తదితర వివరాలను కలెక్టర్‌ సంతకం చేసి అఫిడవిట్‌తో కమిషన్‌కు అందజేయాలని సూచించారు.

ఎన్నో ఏండ్ల నుంచి భూమి ని నమ్ముకొని జీవనం గడుపుతున్న పేద రైతులకు వారి నుంచి తిరిగి భూమి తీసుకుంటున్న సందర్భంలో ప్రభుత్వ అధికారులు చట్టం ప్రకారం నడుచుకోవాలని ఆయన చె ప్పారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా, కనీసం నోటీస్‌ ఇవ్వకుండా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం, కొందరి ప్రభుత్వ భూమికి ఇప్పటి వరకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదని తదితర ఫిర్యాదులు జిల్లా నుంచి వచ్చాయన్నారు. ప్రధాన మంత్రి ఆవా స్‌ యోజన కింద ఎంత మందికి రుణా లు ఇచ్చారు, ఆత్మనిర్భర భారత్‌, ము ద్రా తదితర పథకాల కింద ఎంత మం దికి రుణాలు ఇచ్చారో, అందులో బీసీ లు ఎంత మంది ఉన్నారో పూర్తి వివరాలను కమిషన్‌కు సమర్పించాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ను ఆదేశించారు. మ త్స్యశాఖ, నీటి పారుదలశాఖ, పరిశ్రమ లు తదితర కీలక శాఖల అధికారులు సమీక్షకు హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కమిషన్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. అదనపు క లెక్టర్‌ చంద్రారెడ్డి మాట్లాడుతూ కమీషన్‌ ద్వారా లేవనెత్తిన అంశాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ ద్వారా అన్ని నివేదికలు పంపించామన్నారు. సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్పీ మధుసూదన్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భూములను లాక్కునే హక్కు ఎవరికీ లేదు
మరికల్‌, ఏప్రిల్‌ 16 : రైతుల భూములను లాక్కునే హక్కు ఎవరికీ లేదని కేంద్ర బీసీ సంక్షేమ సాధికారిక కమి టీ సభ్యుడు ఆచారి తల్లోజు అన్నారు. మరికల్‌ శివారులో ని సర్వే నంబర్‌ 449లో పేదలకు ఇచ్చిన భూములను ప్ర భుత్వ కార్యాలయాల పేరుతో అధికారులు లాక్కుంటున్నారని రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు. మండలంలో రై తుల అభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ భూములను నమ్ముకు ని జీవిస్తున్న వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూ ములను ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి భూములు అవసరమైతే కేంద్రం 2013లో అమలు చేసిన చట్టం ప్రకారం పట్టాభూమి, ప్రభుత్వ భూమి కానీ మూ డింతర నష్టపరిహాం చెల్లించి తీసుకోవాలన్నారు. తప్పుడు ఆధారాలతో, బలవంతంగా రైతుల భూములను లాక్కోడానికి చూస్తే అధికారులపై కమిషన్‌ కఠిన చర్యలు తీసుకు ంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫోరం ఫర్‌ జస్టి స్‌ జాతీయ ఉపాధ్యక్షుడు నారాయణరావు, కో- ఆర్డినేటర్‌ మురహరి, కొండయ్య పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్ర లాక్‌డౌన్‌పై కంగ‌నా ర‌నౌత్ సెటైర్లు

వివేక్ త్వ‌ర‌గా కోలుకుంటారు: న‌టి ఖుష్బూ

Advertisement
వెనుకబడిన తరగతులకు 27 శాతం వాటా ఇవ్వాలి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement