ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

అలంపూర్/అయిజ/గట్టు, జనవరి 23: స్వాతంత్య్ర సమరంలో బ్రిటీషువారికి ఎదురు నిలిచి భారత నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతలకే నేతయని ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం, ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ అన్నారు. శనివారం అలంపూర్ పట్టణంలో అజయ్ సేవాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన నేతాజీ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్రాహ్మణ వీధిలో ఏర్పా టు చేసిన నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కవులను సన్మానించారు. తుంగభధ్ర పుష్కరాల విధుల్లో భక్తులకు ఉత్తమ సేవలందించిన ఎస్పీ రంజన్త్రన్ కుమార్, ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి, సీఐ వెంకట్రామయ్య, నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలను సన్మానించారు. డ్యాన్స్ మాస్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిన్నారి కళాకారులను ఎమ్మెల్యే, ఎస్పీ తదితరులు సన్మానించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ అజయ్ సేవాదళం ఆధ్వర్యంలో కొవిడ్ లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని, అందరి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామన్నారు. సభావేదికపై ఎమ్మెల్యేను, ఎస్పీని గజమాల తో సన్మానించారు. కార్యక్రమంలో అజయ్ సేవాదళం అధ్యక్ష కార్యదర్శులు మతిన్ షేక్షావలి, వెంకట్రామయ్యశెట్టి, మున్సిపల్ చైర్మన్ మనోరమ వెంకటేశ్, వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మద్దిలేటి, ఆలయ కమిటీ చైర్మన్ రవి ప్రకాశ్‌గౌడ్, మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, ఆలయ ధర్మకర్తలు మాజీ ఎంపీపీ సుదర్శన్‌గౌడ్, ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, సీనియర్ తెలుగు పండిత్ ఆకుమళ్ల కృష్ణమూర్తి, కలుగోట్ల తేజ,నథానియేలు,కాలనీ వాసులు పాల్గొన్నారు. అయిజ మండలం ఉత్తనూరు గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురష్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు తిమ్మారెడ్డి సర్వేశ్వరాచారి, ఏబేలు, లక్ష్మీరెడ్డి, అనిల్‌కుమార్, ఆనంద్, శ్యాంసన్, పవన్‌కుమార్, మల్లేశ్, చాణక్య తదితరులు పాల్గొన్నారు. గట్టులో నేతాజీ జయంతిని శనివారం వేర్వేరుగా ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ఉప్పరి ధనలక్ష్మి లైబ్రరీ కూడలిలో నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి కన్వీనర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నేతాజీకి నివాళులర్పించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలోనూ నేతాజీ జయంతి నిర్వహించారు. కార్యక్రమాల్లో రిటైర్డ్ ఎంఈవో సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు కృష్ణమూర్తి, బూదెప్ప, హన్మంత్‌రెడ్డి, బజారి, కృష్ణ, రామునాయుడు, బీజేపీ నాయకులు మోహన్‌చంద్ర, భాస్కర్, మహదేవ్, నాగయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.