అన్నదాతను ఆగం చేసే చట్టాలొద్దు

- జెడ్పీ చైర్పర్సన్ సరిత
అలంపూర్ : ప్రభుత్వాలు చట్టాలు అమలు చేస్తే అవి అన్నదాతలకు ఉపయోగ పడే విధంగా ఉండాలని కాని ఆగం చేసే విధంగా ఉండకూడదని జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. పుల్లూరు చెక్‌పోస్టు వద్ద 44వ జాతీయ రహదారిపై మంగళవారం రహదారి దిగ్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే అన్నదాతకు అండగా ప్రభుత్వం నిలవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పెద్ద పీట వేసి , దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చట్టాల అమలు ముసుగులో రైతు నడ్డి విరుస్తుందని ఆరోపించారు. రైతులకు అపకారం తలపెట్టే చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతునడ్డి విరిచే చట్టాలను వ్యతిరేకిద్దాం: ఎమ్మెల్యే అబ్రహం
ఉండవెల్లి : రైతునడ్డి విరిచే చట్టాలను వ్యతిరేకించాలని ఎమ్మెల్యే అబ్రహం రైతులకు ప్రజాప్రతినిధులకు పిలుపు నిచ్చారు. మండలంలోని 44వ జాతీయ రవాదారి పుల్లూరు టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే అబ్రహం ఆధ్వర్యంలో మంగళవారం భారత్‌బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమాని ముఖ్యఅతిథిగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూకేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి రైతుల కోసం ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నూతన విధానంతో మోటర్ ఉన్న ప్రతి రైతుకు విద్యుత్ మీటర్‌ను అమర్చి ఉచిత విద్యుత్ అమలు కాకుండా ప్రధానమంత్రి చట్టాలను అమలు చేశారని రైతులకు వివరించారు. తెలంగాణలో ప్రతి ఏడాది రెండు విడుతలుగా రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన నూతన చట్టాల వల్ల కార్పొరేట్ సంస్థలు బలోపేతమై సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉండవన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సరిత, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాందేవ్‌రెడ్డి, వైస్ చైర్మన్ బుక్కాపురం లక్ష్మన్న, ఎంపీపీ బీసమ్మ, సీపీఎం నాయకులు దేవదాస్, మద్దిలేటి, ఈదన్న, రాజు, సీఐటీయూ నాయకులు వెంకటేశ్వర్లు సర్పంచులు, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రవాదారిపై నిలిచిన వాహనాలు
ఉదయం 11గంటలకే అలంపూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులు అలంపూర్ చౌరస్తా టోల్గేట్ వద్దకు చేరుకొని జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలు రెండు కిలోమీటర్ల్ల వరకు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు కర్నూల్ నుంచి వచ్చే వాహనాలను పుల్లూరు మీదుగా జాతీయ రహదారికి మళ్లీంచారు.
రోడ్డుపైనే భోజనాలు
భారత్ బంద్‌లో భాగంగా టోల్గేట్ వద్ద వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పీచైర్‌పర్సన్ సరిత రోడ్డుపైనే రైతులతో కలిసి మధ్యాహ్నం సహపంక్తిభోజనం చేశారు.
తాజావార్తలు
- మహమ్మారి వల్ల పెళ్లిళ్లు తగ్గాయ్
- తెలంగాణ వ్యాప్తంగా అఖండ హనుమాన్ ఛాలిసా పారాయణం
- పశ్చిమ బెంగాల్లో భారీగా నాటుబాంబులు స్వాధీనం
- సంజయ్‌లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్.. క్వారంటైన్లో ఆలియాభట్
- రాహుల్ ‘బ్యాక్‌బెంచ్’ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా కౌంటర్!
- బ్లాక్ చెయిన్ తంటా.. పేమెంట్స్ సందేశాలకు తీవ్ర అంతరాయం
- నమ్మిన వ్యక్తులు మోసం చేశారని తెలిసి షాకయ్యా: రాజేంద్రప్రసాద్
- స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి
- త్వరలో మేడిన్ ఇండియా ఐఫోన్ 12
- పుంజుకున్న కార్లు, ట్రాక్టర్ల సేల్స్.. త్రీ వీలర్స్ 50 శాతం డౌన్!