బుధవారం 03 మార్చి 2021
Gadwal - Nov 18, 2020 , 02:31:15

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

  • అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌

మదనాపురం : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు, తిర్మలాయపల్లి సెంటర్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ఐకేపీ, సింగిల్‌ విండో, వ్యవసాయ మార్కెట్ల ద్వారా నేరుగా రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యాన్ని విక్రయించే సమయంలో మట్టిపెడ్డలు, చెత్త చెదారం లేకుండా శుభ్రం చేసి తీసుకురావాలని రైతులకు సూచించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగిన ప్రభు త్వం విరివిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో డీఎస్‌వో రేవతి, తాసిల్దార్‌ సంధ్య, డిప్యూటీ తాసిల్దార్‌ అశోక్‌ ఉన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి

కొత్తకోట రూరల్‌ : గ్రామాల్లో సింగిల్‌విండో, మహిళ సమైఖ్యల ద్వారా ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని జెడ్పీ వైస్‌చైర్మన్‌ వామన్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని పామాపురం గ్రామంలో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌ వ్యవసాయ కమిటీ చైర్మన్‌ బాలనారాయణ, సింగిల్‌విండో అధ్యక్షుడు వాసుదేవారెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరను పొందాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్‌, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొండారెడ్డి,  సొసైటీ వైస్‌ చైర్మన్‌ వెంకటయ్య, డైరెక్టర్లు శ్రీనివాసులు, హరిశ్చంద్రారెడ్డి, విష్ణునాయుడు, సక్రునాయక్‌, నాయకుడు భీంరెడ్డి, రైతులు ఉన్నారు. 

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

పెద్దమందడి : మండలంలోని రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పామిరెడ్డిపల్లి, వెల్టూర్‌, మంగంపల్లి, వీరాయిపల్లి, జంగమాయిపల్లి, దొడగుంటపల్లి, చిన్నమందడి, అల్వాల, మోజర్ల, మద్దిగట్ల, మనిగిల్ల గ్రామాల్లో సింగిల్‌విండో, మహిళ సమైఖ్యల ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మన్నెంరెడ్డి, వ్యవసాయాధికారి మల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, సిద్దయ్య, సతీశ్‌, సువర్ణమ్మ, వరలక్ష్మి, సరిత, తిరుపతిరెడ్డి, నాయకులు లక్ష్మీకాంత్‌రెడ్డి, బాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్‌, సీఈవోలు సుధాకర్‌, జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీలు, రైతుబందు కోఆర్డినేటర్లు జానకిరాములు, వెంకట్రాంరెడ్డి ఉన్నారు. 

VIDEOS

logo