మంగళవారం 27 అక్టోబర్ 2020
Gadwal - Sep 25, 2020 , 06:20:10

అక్టోబర్‌లోగా బియ్యం అందించాలి

అక్టోబర్‌లోగా బియ్యం అందించాలి

  • కలెక్టర్‌ శృతిఓఝా

గద్వాల: మిల్లర్లు వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి దాదాపు 12,505 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉందని, జిల్లా కోఆపరేటివ్‌ అధికారి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీలు, మిల్లర్ల వెంట పడి అక్టోబర్‌లోగా మొత్తం ధాన్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శృతిఓఝా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ చాంబర్‌లో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కష్టం బిల్డింగ్‌రైస్‌పై సమీక్ష నిర్వహించారు.

జిల్లాలోని రైస్‌ మిల్లులకు నిత్యం 174 మెట్రిక్‌ టన్నుల కన్నా అధికంగా ధాన్యాన్ని బియ్యంగా మార్చే అవకాశం ఉందని, అలాంటప్పుడు యాసంగిలో తీసుకున్న వరి ధాన్యం ఇప్పటివరకు ఎందుకు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 23,948,83 మెట్రిక్‌ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 11,052 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో ఎక్కువ భాగం బాయిల్డ్‌రైస్‌ పెండింగ్‌లో ఉందని రైస్‌ మిల్లర్లు ఇంకా 12,505 మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌రైస్‌ ఎఫ్‌సీఐకి అందజేయాల్సి ఉందన్నారు.

రాష్ట్రంలో గద్వాల జిల్లా వెనుకబడి ఉందని చెప్పారు. సాధారణ బియ్యం 5,440 మెట్రిక్‌ టన్నులు జిల్లాకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 5,049 మెట్రిక్‌ టన్నులు ఇ వ్వడం జరిగిందన్నారు. మిగిలిన 391 మెట్రిక్‌ టన్నులు రెండు రోజుల్లో సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీసీవో ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యం ఏర్పరుచుకోవాలి :  అదనపు కలెక్టర్‌

వచ్చే ఏడాది హరితహారం కార్యక్రమానికి జిల్లాలో నాటాల్సిన మొక్కల లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని లక్ష్యం ఏర్పరుచుకోవాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో హరితహారం యాక్షన్‌ ప్లాన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సారి జిల్లాలో ఎర్రచందనం, గందపు మొక్కలు, కరివేపాకు, గోరింటాకు తదితర మొక్కలు నర్సరీల్లో పెంచాలన్నారు. కనీసం 300ఎకరాల అటవీ ప్రాంతంలో మొక్కలు నాటి అటవీ శాతాన్ని పెంచాలన్నారు. సమావేశంలో అటవీశాఖ అధికారి బాబ్జిరావు, డీపీవో కృష్ణ, వ్యవసాయశాఖ అధికారి గోవిందునాయక్‌, ఉద్యానవన శాఖ అధికారి సురేశ్‌, హరితహారం మేనేజర్‌ వెంకట్రాములు పాల్గొన్నారు.


logo